Site icon NTV Telugu

Pakistan: రుణం కోసం మళ్లీ ఐఎంఎఫ్కు పాకిస్తాన్.. ఈసారి ఏకంగా..!

Imf Pak

Imf Pak

Pakistan: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న విదేశీ నిల్వలు, స్థానిక కరెన్సీ పతనం కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి మరోసారి సహాయం చేసేందుకు రెడీ అయింది. దీంతో పాక్ లో పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టవచ్చు అని అభిప్రాయ పడింది. అయితే ఇప్పటికే, ఇస్లామాబాద్ లో తమ సిబ్బంది పర్యటనను పూర్తి చేసినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా, 2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదన, ఆర్థిక విధానం, నిధుల ద్వారా జరుగుతున్న సంస్కరణలపై పాకిస్తాన్ అధికారులతో చర్చించారు. రాబోయే రోజుల్లో బడ్జెట్‌పై ఏకాభిప్రాయానికి రావడానికి పాక్ అధికారులతో చర్చలు కొనసాగించినట్లు ఐఎంఎఫ్ వెల్లడించింది.

Read Also: Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న ప్రెస్ నోట్..!

ఇక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ యొక్క మధ్యకాలిక లక్ష్య పరిధి 5-7 శాతం లోపల ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని అంతర్జాతీయ ద్రవ్య నిధి తెలిపింది. ఇస్లామాబాద్ లో కొనసాగుతున్న ఆర్థిక స్థిరీకరణ ప్రయత్నాలపై దృష్టి పెట్టడమే దీని ఉద్దేశ్యం అని చెప్పుకొచ్చింది. ఇక, పాకిస్తాన్ అధికారులు కూడా దేశ ఆదాయాన్ని సరిగ్గా వినియోగించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ మిగులును 1.6 శాతం దగ్గర కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, పెద్ద ఎత్తున ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఉండడం అవసరం. కాగా, ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి వినియోగం కంటే ఎక్కువగా ఉంటేనే జీడీపీలో మిగులు ఏర్పడుతుంది.

Read Also: Groom Kidnapped: పెళ్లి వేదికపై కలకలం.. పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసిన డ్యాన్స్ టీమ్..!

అయితే, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇటీవల పాకిస్తాన్‌కు ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద $1 బిలియన్ ఆర్థిక సహాయం అందించింది. దీంతో పాటు వాతావరణం వల్ల కలిగిన నస్టాన్ని పూరించడానికి $1.4 బిలియన్ల నిధులు కూడా ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ మరోసారి నిధుల సమీక్ష 2025 ద్వితీయార్థంలో జరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి కూడా ధృవీకరించింది.

Exit mobile version