Pakistan: పాకిస్తాన్ లో ఇస్లామిక్ మతఛాందసవాదులు ఎంతలా పెరిగి పోయారంటే దైవదూషణ పేరుతో ప్రాణాలు తీస్తున్నారు. ఏకంగా పోలీస్ స్టేషన్ల పై దాడులు చేస్తూ ప్రజలను చంపేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ తొలి ట్రాన్స్‌జెండర్ న్యూస్ యాంకర్ పై కాల్పులు జరిపారు దుండగులు. మార్వియా మాలిక్ (26) లాహోర్ లో ఫార్మసీ నుంచి తన ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో తుపాకీ దాడికి గురైంది.