పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రెండు నెలల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లాడు. ట్రంప్ ఆహ్వానం మేరకు ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించాడు. ఇక వైట్‌హౌస్‌లో ట్రంప్ ప్రత్యేక విందు కూడా ఇచ్చారు. అయితే పర్యటనలో భాగంగా పాకిస్థానీయుడు ఏర్పాటు చేసిన విందులో అసిమ్ మునీర్ మాట్లాడుతూ.. భారత్‌పై విషం కక్కాడు. భారత్ మెరిసే మెర్సిడెస్ కారు అని.. పాకిస్థాన్ డంప్ ట్రక్కు లాంటిదని పోల్చారు. అంతేకాకుండా తాము నాశనం అవుతున్నామంటే.. సగం ప్రపంచాన్ని ఆణ్వాయుధాలతో నాశనం చేస్తామని బెదిరించాడు. అంతేకాకుండా సింధు జలాలు అడ్డుకుంటే భారతదేశం కట్టే ఆనకట్టను క్షిపణులతో పేల్చేస్తామని కారు కూతలు కూశాడు. అయితే పాకిస్థాన్‌ను డంప్ ట్రక్కుతో పోల్చడంపై అసిమ్ మునీర్‌పై పెద్ద స్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.
ఇది కూడా చదవండి: UP: మీరట్‌లో దారుణం.. జవాన్‌ను స్తంభానికి కట్టేసి చావబాదిన టోల్ సిబ్బంది
తాజాగా అసిమ్ మునీర్ బాటలోనే పాకిస్థాన్ మంత్రి చేరారు. అసిమ్ మునీర్‌లాగానే పాకిస్థాన్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ కూడా భారత్‌ను మెర్సిడెస్ కారుతోనూ.. పాకిస్థాన్‌ను డంప్ ట్రక్కుతో పోల్చాడు. ట్రక్కు.. కారును ఢీకొడితే ఏం జరుగుతుందో తెలిసిందే కదా? అని వ్యాఖ్యానించాడు. లాహోర్‌లో జరిగిన ఒక సెమినార్‌లో ప్రసంగిస్తూ నఖ్వీ ఈ వ్యాఖ్యలు చేశాడు. అసిమ్ మునీర్ ఎలాగైతే పోల్చాడో.. అదే మాదిరిగా రెండు దేశాలను పోల్చాడు. దీంతో మంత్రిపై కూడా నెట్టింట దాడి మొదలైంది. సోషల్ మీడియా వేదికగా మంత్రిని ఓ ఆటాడుకుంటున్నారు. సొంత దేశాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానించడంపై పాకిస్థానీయులు ధ్వజమెత్తుతున్నారు.
ఇది కూడా చదవండి: Gyanesh kumar vs INDIA Bloc: ముదురుతున్న ఓట్ల చోరీ వివాదం.. సీఈసీపై అభిశంసన తీర్మానం పెట్టేందుకు ప్లాన్
"India is a shining Mercedes. We are a dumper truck full of gravel. If we collide, you know the impact on Mercedes. Our field Marshal Munir says", says Pakistan's interior minister Mohsin Naqvi
At least he admits it — Pakistan survives only by threats & collisions, not by… pic.twitter.com/CYmOyfeYCD
— 𝐃𝐎 𝐍𝐞𝐰𝐬 (@donewstoday) August 18, 2025