Naveen Krishna Comments On Pavitra Lokesh: నరేష్- పవిత్ర లోకేశ్ ఈ పేర్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు ముందు వరకు చాలా హల్ చల్ చేశాయి. ఎక్కడ చూసిన ఈ పేర్లే వినిపించేవి. ఏ ప్రోగ్రామ్ చూసినా ఈ జంటే కనిపించేది. నరేష్ కు నాలుగో పెళ్లి, పవిత్రకు ఇది రెండో పెళ్లి కావడంతో అందరూ వీరి వివాహం గురించే మాట్లాడేవారు. అంతేకాకుండా వీరిద్దరు కలిసి వీళ్ల కథనే మళ్లీ పెళ్లి అనే సినిమాలో చూపించారు. అయితే ఈ సినిమా థియేటర్ల వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.
Also Read: Vaishnavi Chaitanya: ఎన్ని కష్టాలు పడిందో మన బేబీ.. వాళ్ల అమ్మ కూడా ఏడ్చేసిందట
ఇక వీరి పెళ్లి గురించి నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. నవీన్ చాలా ఏళ్ల క్రితం హీరోగా ఓ సినిమా తీశాడు. ‘నందినీ నర్సింగ్ హోమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఒకవైపుగా నటిస్తూనే దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని నవీన్ ఆలోచిస్తున్నారు. ఇక తాజాగా పవిత్ర లోకేశ్ తో నరేష్ పెళ్లి గురించి నవీన్ స్పందిచారు. నరేష్, పవిత్ర లోకేశ్ పెళ్లి చేసుకున్నారని తెలిపిన నవీన్ అది వాళ్ల వ్యక్తిగత విషయమన్నారు. ఈ విషయంలో చాలా మంది వారిని విమర్శించారని తెలిపాడు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు విమర్శించేవారు అయిపోయారని అందరిని సంతోషపరచడం సాధ్యం కాదన్నారు. ఈ కాలంలో ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు కామెంట్స్ చేయడం కామన్ అన్నారు.
ఒక కొడుకుగా తాను మాత్రం ఎప్పుడు తన తండ్రి హ్యాపీగా ఉండాలని కోరుకుంటానని తెలిపారు. ఏం చేయాలో తన తండ్రికి తెలుసునని, ఆయన మనసుకు నచ్చినట్లు చేయడమే కరెక్ట్ అని తాను అనుకుంటానని వెల్లడించారు. ఇక అదే సమయంలో పవిత్ర నరేశ్ పై కూడా అనుకోని విధంగా నవీన్ ప్రశంసల వర్షం కురిపించాడు. పవిత్ర లోకేశ్ తనకు చాలా కాలం నుంచి తెలుసని నవీన్ చెప్పాడు. ఆమె చాలా సైలెంట్ అని అదే సమయంలో ఆమె స్ట్రాంగ్ గా కూడా ఉంటారని కితాబిచ్చాడు. అలాంటివారు చాలా తక్కువ మంది ఉంటారని నవీన్ పేర్కొన్నాడు. అయితే నరేష్ కన్న కొడుకు పవిత్ర లోకేశ్ పై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.