Sadia Imam: పెట్రోల్ ధరలపై ఆగ్రహం.. పాక్ నేతలపై నటి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sadia Imam: పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి, టీవీ హోస్ట్ సాదియా ఇమామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.300కు చేరడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై స్పందించిన సాదియా, దేశ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “మీరు అందరూ చచ్చిపోతే పోయేదేముంది? కొత్తవాళ్లు వస్తారు, కొత్త ఆలోచనలు వస్తాయి” అంటూ ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
Read Also: Strait of Hormuz: హర్మూజ్‌లో ఎక్కడికక్కడే నిలిచిపోయిన వందలాది షిప్స్.. ఏరియల్ ఫోటోలు వైరల్
Also Read
- Iran Hit List: ఇరాన్ హిట్‌లిస్ట్‌లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
- Israel General Election 2026: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలకు తేదీ ఖరారు.. గాజా యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుకు కీలక పరీక్ష
- US Iran Conflict: ఇరాన్‌పై అమెరికా దాడి.. సిరిక్, బందర్ అబ్బాస్‌లలో పేలుళ్లు.. హార్ముజ్‌లో వాణిజ్య నౌకలపై కాల్పులు
- Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్‌లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
పెట్రోల్ ధరలను అనవసరంగా పెంచుతున్నారని ఆరోపించిన సాదియా ఇమామ్.. “పాత స్టాక్ ఉన్నప్పటికీ కొత్త ధరలు ఎలా నిర్ణయిస్తారు?” అంటూ ప్రశ్నించారు. ఇతర దేశాలతో పోలిస్తే పాకిస్థాన్‌లో ధరలు ఎక్కువగా పెరగడం పై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశం, బంగ్లాదేశ్ వంటి దేశాల ఉదాహరణలు చూపిస్తూ, అక్కడ పరిస్థితి ఇంత తీవ్రంగా లేదని పేర్కొన్నారు. అలాగే ఇరాన్ నుంచి చౌకగా పెట్రోల్ పొందే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం దానిని వినియోగించుకోకపోవడంపై కూడా ఆమె ప్రశ్నించారు. ఐఎంఎఫ్ అప్పుల కారణంగా దేశం ఆర్థిక ఒత్తిడిలో ఉందని విమర్శించారు.
ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, బిలావల్ భుట్టో జర్దారీ, అలాగే ఇతర నాయకులను ఉద్దేశించి సాదియా ఘాటుగా స్పందించారు. “మీరు ఎక్కడున్నారు? ప్రజల సమస్యలు మీకు కనిపించడం లేదా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సాదియా వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. చాలా మంది ఆమె అభిప్రాయాలను సమర్థిస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో పాకిస్థాన్ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
-
Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
-
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!