Iran War: ఇరాన్ యుద్ధం, మధ్యవర్తిగా పాకిస్తాన్.. ఇస్లామాబాద్‌లో చర్చలు..!
- ఇరాన్-అమెరికా మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం..?
- ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: మిడిల్ ఈస్ట్ యుద్ధం మూడో వారానికి చేరింది. ఇప్పటికీ ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయిల్‌తో పాటు గల్ఫ్ లోని సౌదీ అరేబియా, కువైట్, బహ్రైయిన్, ఖతార్, యూఏఈలపై దాడులు చేస్తూనే ఉంది. ఇక చమురు సరఫరాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ తన కంట్రోల్‌కి తీసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది.
ఇదిలా ఉంటే, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసేందుకు ముందుకు వచ్చింది. యుద్ధం తీవ్రం అవుతున్న వేళ తాను మధ్యవర్తిగా వ్యవహరించేందుకు దాయాది దేశం ప్రయత్నిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. ఇరాన్‌తో పాటు అటు అమెరికాతో పాకిస్తాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక గల్ఫ్ దేశమైన సౌదీతో ప్రత్యేకంగా రక్షణ ఒప్పందం కూడా పాకిస్తాన్ చేసుకుంది. ఈ మూడు కారణాల వల్ల పాకిస్తాన్ ‘మీడియేటర్’గా వ్యవహరించాలని అనుకుంటోంది.
Also Read
- Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
- US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్‌లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
- TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
- Asim Munir: టెహ్రాన్‌కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
వస్తున్న రిపోర్టుల ప్రకారం, అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య ఈ వారంలోనే చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు ఉండే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడినట్లు సమాచారం. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ విషయమై చర్చలు జరిపారు.
ట్రంప్ చర్చలకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఒక ప్రకటనలో ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నట్లు, త్వరలోనే ఒక డీల్ కుదురుతుందని ట్రంప్ అన్నారు. అయితే, ఇరాన్ వీటన్నింటిని ఖండించింది. ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేసింది. అయితే, కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం చేస్తున్నాయని ఇరాన్ అంగీకరిచింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు.
ఇరాన్ తర్వాత, పాకిస్తాన్‌లోనే అతిపెద్ద షియా ముస్లిం జనాభా ఉంది. గల్ఫ్ దేశాలతో బలమైన సంబంధాలు ఉండటం పాకిస్తాన్‌కు లాభిస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సందర్భాల్లో అసిం మునీర్, షరీఫ్‌లో ట్రంప్‌ను వైట్‌హౌజ్‌లో కలిశారు. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ మధ్యవర్తిత్వంలో పాక్ విజయవంతమైతే ప్రాంతీయ శాంతికి దోహదం చేయడంతో పాటు, అంతర్జాతీయం దాని ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రస్తుతం, పాక్‌లో ఉన్న సమస్యల్ని కొంతకాలం పాటు పక్కదారి పట్టించే అవకాశం కూడా అక్కడి సైన్యం, పాలకులకు దొరుకుతుంది.
తాజావార్తలు
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
-
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్‌వర్క్.. కేన్స్‌లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!