Pakistan-Man Chops Off police Ears, Lips:తన భార్యను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ పోలీస్ ప్రాణాలు మీదికి తెచ్చాడు భర్త. అక్రమ సంబంధం వ్యవహారంలో ఆగ్రహంతో ఉన్న భర్త.. పోలీస్ అని చూడకుండా ఓ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేశాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు పోలీస్ కానిస్టేబుల్ ముక్కు, చెవులు, పెదాలను నరికేశాడు. ఈ ఘటన పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లో జరిగింది. లాహెర్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝాంగ్ జిల్లాలో ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది.
నిందితుడు మహమ్మద్ ఇఫ్తికార్.. తన సహచరులతో కలిసి పోలీస్ కానిస్టేబుల్ ఖాసిం హయత్ ముక్కు, చెవులు, పెదాలను కోసేశాడు. ఈ ఘటనకు ముందు కానిస్టేబుల్ హయత్ ను తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. కానిస్టేబుల్ ఖాసిం హయత్ కు తన భార్యతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో నిందితుడు ఇఫ్తికార్ 12 మంది అనుచరులతో కలిసి ఖాసిం హయత్ ను కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టాడు. ఆ తరువాత శరీర భాగాలు ముక్క, చెవులు, పెదాలను పదునైన ఆయుధంతో కోశాడని పోలీస్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ ఖాసిం హయత్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం కానిస్టేబుల్ ఝాంగ్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Read Also: Laal Singh Chaddha: హిందీ సినిమాలు అందుకే చేయలేదన్న చైతూ..!!
గత నెల ఇఫ్తికార్, కానిస్టేబుల్ హయత్ పై తన భార్యను వేధిస్తున్నాడని కేసులు పెట్టాడు. హయత్ తన కుమారుడిని చంపేస్తానని బెదిరిస్తూ.. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడని..భర్త ఇఫ్తికార్ కేసు నమోదు చేశాడు. అక్రమ సంబంధానికి సంబంధించిన వీడియో తీసి తన భార్యను బెరిస్తున్నట్లు ఇఫ్తికార్ ఆరోపించాడు. ప్రస్తుతం ఇఫ్తికార్ అతని అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.