Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్ప్లే
- Samsung Galaxy S26 FE వచ్చేసింది
- Exynos 2500 ప్రాసెసర్, 3x ఆప్టికల్ జూమ్
- 7 ఏళ్ల అప్డేట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ కంపెనీ కొత్త ఫ్యాన్ ఎడిషన్ 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Samsung Galaxy S26 FE పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 అంగుళాల Dynamic AMOLED 2X డిస్ప్లే, Exynos 2500 ప్రాసెసర్, 50MP ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్, లాంచ్ ఆఫర్ల వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy S26 FE ధర, కలర్ ఆప్షన్స్
భారత్‌లో సామ్సంగ్ గెలాక్సీ S26 FE స్మార్ట్‌ఫోన్‌ను 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్లో విడుదల చేసినట్లు సమాచారం. దీని ధర రూ.79,999గా ఉంది. ఈ ఫోన్ పిస్తాచియో, బ్లూబెర్రీ, గ్రాఫైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Also Read
- Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
లాంచ్ ఆఫర్లు
Samsung Galaxy S26 FE కొనుగోలు చేసే కస్టమర్లకు పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్పై రూ.8,000 వరకు అప్‌గ్రేడ్ బోనస్. ఎంపిక చేసిన NBFC భాగస్వాముల ద్వారా 30 నెలల వరకు నో-కాస్ట్ EMI. అదనంగా రూ.3,000 వరకు అప్‌గ్రేడ్ బోనస్. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.7,000 వరకు క్యాష్‌బ్యాక్ లేదా 12 నెలల నో-కాస్ట్ EMI. సామ్సంగ్ ఈ-స్టోర్‌లో 18 నెలల బ్యాంక్ EMI సదుపాయం. ఆఫర్లకు వర్తించే నిబంధనలు, అర్హతలు ఉంటాయి.
Samsung Galaxy S26 FE డిస్ప్లే
సామ్సంగ్ గెలాక్సీ S26 FEలో 6.7 అంగుళాల FHD+ Dynamic AMOLED 2X డిస్ప్లే అందించారు. ఈ స్క్రీన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే 1,900 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ను అందిస్తుందని సమాచారం. దీంతో వీడియోలు చూడటం, గేమింగ్, రోజువారీ వినియోగంలో మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ లభించే అవకాశం ఉంది.
ప్రాసెసర్, సాఫ్ట్వేర్
ఈ కొత్త సామ్సంగ్ ఫోన్లో Exynos 2500 ప్రాసెసర్‌ను అందించారు. ఇది 3nm ప్రాసెస్‌పై తయారైన చిప్‌గా పేర్కొన్నారు. ఫోన్ Android 17 ఆధారిత One UI 9 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. అలాగే ఏడు సంవత్సరాల వరకు సాఫ్ట్వేర్, సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని కంపెనీ తెలిపింది. మెమరీ.. 8GB RAM, 256GB స్టోరేజ్.
కెమెరా ఫీచర్లు
ఫొటోగ్రఫీ కోసం Samsung Galaxy S26 FEలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
వెనుక కెమెరాలు
50MP వైడ్ కెమెరా – OIS సపోర్ట్‌తో.
12MP అల్ట్రా వైడ్ కెమెరా – 123 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ.
8MP టెలిఫోటో కెమెరా – OIS, 3x ఆప్టికల్ జూమ్‌తో.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 12MP ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ, ఛార్జింగ్
Samsung Galaxy S26 FEలో 4,900mAh బ్యాటరీ ఉంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 45W అడాప్టర్ ఉపయోగించి సుమారు 30 నిమిషాల్లో బ్యాటరీ 69 శాతం వరకు ఛార్జ్ అవుతుందని సమాచారం. దీంతో పాటు 15W ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్, Wireless PowerShare ఫీచర్లు కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!