Pakistan: ‘‘మా సైన్యం వల్ల కావడం లేదు’’.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- బలూచిస్తాన్ విస్తీర్ణంతో మా సైన్యం అలసిపోతోంది..
- బీఎల్ఏ దాడులపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)ను ఎదుర్కోవడంలో తమ సైన్యం వల్ల కావడం లేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. బలూచిస్తాన్ విస్తీర్ణం పెద్దది కావడంతో పాక్ భద్రతా బలగాలు అలసిపోతున్నాయని చెప్పారు. జాతీయ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన… పాకిస్తాన్లో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్ విస్తీర్ణమే భద్రతా బలగాలకు ప్రధాన సవాల్ అని అన్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల నేపథ్యంలో ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Read Also: Adani-Italy Deal: అదానీ-లియోనార్డో కీలక ఒప్పందం.. భారత్‌లో హెలికాప్టర్ ఉత్పత్తి..
Also Read
- Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
బలూచిస్తాన్ భూభాగం పాకిస్తాన్లో 40 శాతానికి పైగా ఉందని, జనసాంద్రత ఉన్న నగరాలను నియంత్రించడం కన్నా, ఇంత పెద్ద ప్రాంతాన్ని కాపాడటం చాలా కష్టమని, భారీ సంఖ్యలో బలగాలు అవసరం అవుతాయని అన్నారు. సైన్యం అక్కడ పనిచేస్తున్నా, అంత పెద్ద ప్రాంతాన్ని గస్తీ కాయడం వల్ల మా సైన్యం అలసిపోతోందని రక్షణ మంత్రి చెప్పారు.
బలూచిస్తాన్‌లో బీఎల్ఏ సమన్వయ దాడులకు పాల్పడింది. పాక్ ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం 177 మంది తిరుగుబాటుదారుల్ని హతమార్చామని, ఈ ఆపరేషన్‌లో 17 మంది పోలీస్, భద్రతా సిబ్బంది చనిపోయినట్లు చెప్పారు. అయితే, బీఎల్ఏ మాత్రం 200 మంది పాక్ సిబ్బందిని హతమార్చినట్లు చెబుతోంది. ఇదిలా ఉంటే, బలూచ్ లిబరేషన్ ఆర్మీతో చర్చించే ప్రసక్తే లేదని ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. మహిళలు, పిల్లల్ని చంపే ఉగ్రవాదులతో చర్చలే ఉండవని అన్నారు. బలూచిస్తాన్‌లో అనేక అభివృద్ధి పనులు జరుపుతున్నారని వెల్లడించారు. బలూచిస్తాన్‌లో ప్రజలు మిస్ అవుతున్నారనే విషయంపై స్పందిస్తూ.. ఉగ్రవాదులు, నేరగాళ్లు దీనిని తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అన్నారు.
తాజావార్తలు
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?