Balochistan: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) భారీ ఎత్తున దాడులు చేసింది. 12 ప్రాంతాల్లో సమన్వయ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 10 మంది పాకిస్తాన్ భద్రతా అధికారులు మరణించగా, 37 బీఎల్ఏ యోధులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో కాల్పులతో పాటు ఆత్మాహుతి బాంబు దాడులు జరిగినట్లు తెలుస్తోంది.