NTV Telugu Site icon

US- Pakistan: పాకిస్థాన్ క్షిపణులతో మాకు ప్రమాదం పొంచి ఉంది..

America

America

US- Pakistan: దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి హెల్ప్ చేస్తున్నారంటూ పాకిస్థాన్ కు చెందిన నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. పాక్ అలాంటి మిస్సైల్స్ తయారు చేయడం వల్ల తమకు సైతం ముప్పు పొంచి ఉందని అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ జోన్ ఫైనర్‌ పేర్కొన్నారు. కాగా, పాకిస్థాన్ దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను అభివృద్ధి చేయడం అమెరికాతో పాటు దక్షిణాసియా దేశాలకు అతి పెద్ద ముప్పు అని చెప్పుకొచ్చారు. అందుకే ఆ దేశానికి చెందిన నాలుగు సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 2021లో ఆఫ్గనిస్థాన్ నుంచి యూఎస్ దళాలు వైదొలిగిన తర్వాత పాక్ తో ఒకప్పటి సంబంధాలు కొనసాగడం లేదన్నారు.

Read Also: AP News: పెనమలూరులో సీఎం, సాలూరులో డిప్యూటీ సీఎం పర్యటన!

కాగా, మరోవైపు పాకిస్థాన్ దీర్ఘశ్రేణి క్షిపణుల తయారీకి సపోర్ట్ ఇచ్చేందుకు అమెరికా చాలా కాలం నుంచి నిరాకరిస్తుందని యూఎస్ స్టేట్‌ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ వేదాంత్ పటేల్ వెల్లడించారు. అయితే, అవి ఇరుదేశాలకు సంబంధించిన ఇతర రంగాలను ప్రభావితం చేయవని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధనకు అమెరికా కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. పాక్ తయారు చేస్తున్న దీర్ఘశ్రేణి ఆయుధాల తయారీని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.

Read Also: Truck Blast In Jaipur: జైపూర్‌లోని పెట్రోల్‌ బంక్‌ వద్ద అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి

అయితే, దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహకరిస్తున్న పాక్‌కు చెందిన నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు పెట్టింది. ఈ జాబితాలో పాక్ ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌, అక్తర్‌ సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అఫిలియేట్స్‌ ఇంటర్నేషనల్‌, రాక్‌సైడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఉన్నాయి. అయితే, ఈ మూడు కంపెనీలు కరాచీ కేంద్రంగా పని చేస్తున్నాయి. ఇక, అమెరికా విధించిన ఆంక్షలు పక్షపాతంతో కూడుకున్నవిగా పాక్ సర్కార్ ఆరోపించింది. సైనికపరమైన అసమానతలను సృష్టిస్తే ప్రాంతీయంగా అస్థిరత నెలకొంటుందని పేర్కొన్నారు.