Pakistan: మాపైనే రైడ్స్ చేస్తారా.? పోలీసులను చితక్కొట్టిన పాక్ ఆర్మీ.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్‌లో ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యం అనేవి బయటకు కనిపించినా, అక్కడ అంతా సైనిక జోక్యమే ఎక్కువ. సైన్యం చెప్పినట్లే ప్రభుత్వం నడుచుకోవాలి. చివరకు వారికి ఎదురు తిరిగితే జైలు జీవితమే గతి అనేది ఇమ్రాన్ ఖాన్ ఉదంతమే తెలుపుతోంది. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ, ఆ దేశ పోలీసులను చితక్కొట్టిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని మోకాళ్లపై కూర్చోబట్టి కొట్టారు. ఈ ఘటన పంజాబ్ ప్రావిన్సులోని బహవల్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఒక సైనికుడి కుటుంబ సభ్యుడి నుంచి అక్రమ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న వివాదంలో పాకిస్తాన్ సైన్యం పోలీస్ అధికారులపై దాడి చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో పాక్ ఆర్మీపై అక్కడి నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వీడియోలో పోలీసులను మోకాళ్లపై కూర్చోబెట్టడం, అందులో కొంతమంది తమను కొట్టవద్దని వేడుకోవడం చూడొచ్చు. ముగ్గురు పౌరుల్ని పోలీసులు చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసి, వారిని విడుదల చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
Read Also: PM Modi: అతి త్వరలో జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా.. ప్రధాని మోడీ..!
వీరిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆర్మీ అధికారి నివాసంపై దాడి చేశారు. దీంతో ఆర్మీ సిబ్బంది ఈ ముగ్గురిని విడిపించేందుకు బహవల్‌నగర్ లోని మదర్సా పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులు చిత్రహింసలకు గురయ్యారని పోలీస్ ఉన్నతాధికారులు గురువారం అక్కడి మీడియాకు చెప్పారు. ఈ ఘటన తర్వాత ఆర్మీ సిబ్బంది చేతిలో తన్నులు తిన్న పోలీస్ అధికారులు ఎస్‌హెచ్ఓ అబ్సాస్ రిజ్వాన్, మహ్మద్ నయిమ్, మహ్మద్ ఇక్బాల్, అలీ రెజా అనే నలుగుర్ని సస్పెండ్ చేసి, అరెస్ట్ చేశారు. అయితే, పంజాబ్ పోలీసులు మాత్రం ఈ ఘటనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన హమ్మద్ అజార్ మాట్లాడుతూ.. పంజాబ్ పోలీస్ చీఫ్ డాక్టర్ ఉస్మాన్ అన్వర్ ఈ అవమానకర ఘటన తర్వాత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Pakarmy beat up police officials in #Bahawalnagar after a dispute over illegal weapon recovery frm one of the family members of a soldier.
The unchecked power & lawlessness of Pak mil is glaring once more. It's a stark reminder of ongoing challenges to 🥰 pic.twitter.com/9i0GDarYqu
— 𝘼𝙧𝙢𝙖𝙖𝙣⚡️ (@zahoib0x) April 11, 2024
https://twitter.com/zzbaloch/status/1778339918231527790
తాజావార్తలు
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
-
Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
-
I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
-
ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!