The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో ‘ది ప్యారడైజ్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: వెండితెరపై ఆశించిన ఫలితం రాకపోయినా, డిజిటల్ వేదికపై మాత్రం న్యాచురల్ స్టార్ నాని తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. ‘దసరా’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో, ఎస్ఎల్వీ సినిమాస్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ‘ది ప్యారడైజ్’. అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్గా, అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు ఆకాశమంత అంచనాలు ఏర్పడ్డాయి. అయితే థియేటర్లలో విడుదలయ్యాక ఆ అంచనాలను అందుకోవడంలో ఈ ప్రాజెక్ట్ తడబడింది.
బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్ మూటగట్టుకున్న ఈ చిత్రం, తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. ఆశ్చర్యకరంగా థియేటర్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా డిజిటల్ ఆడియన్స్ ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. నెట్టింట ఇప్పటికీ నెగెటివ్ రివ్యూలు వినిపిస్తున్నప్పటికీ, వాటన్నింటినీ తుత్తునియలు చేస్తూ నాని తన స్టార్ ఇమేజ్‌తో ఓటీటీలో సంచలనం సృష్టించారు. స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి వ్యూస్‌ను సొంతం చేసుకున్న ‘ది ప్యారడైజ్’, ఇండియా వైడ్ టాప్ ట్రెండింగ్ చార్ట్స్‌లో ఏకంగా నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. కథాకథనాలపై ఎలాంటి విమర్శలు వచ్చినా ఓటీటీ మార్కెట్లో నాని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదని ఈ రికార్డు చాటిచెబుతోంది. ప్రారంభంలోనే ఈ స్థాయి దూకుడు ప్రదర్శిస్తున్న ఈ చిత్రం, రానున్న రోజుల్లో మరెన్ని వ్యూయర్షిప్ రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
Also Read
- AK 47: 'ఆదర్శ కుటుంబం'పై తగ్గిన క్రేజ్.. తమన్ పాటలతో మరింత డౌన్.. ఇక ట్రైలర్‌పైనే ఆశలు!
- Kalki 2: భైరవ ఈజ్ బ్యాక్.. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్..! ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే మేకింగ్ వీడియో..
- Kajal Aggarwal-Ramayana: 'రామాయణ'లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
- Khaidi Inspiration: చిరంజీవి ‘ఖైదీ’ సినిమాతో మొదలైన కల.. ఇప్పుడు తొలి చిత్రం!
తాజావార్తలు
-
The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో ‘ది ప్యారడైజ్’!
-
BJP: కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీ vs రాహుల్ గాంధీ.. బీజేపీ సంచలన ఆరోపణలు..
-
Bhumana Karunakar Reddy: ఎక్కడికక్కడ నామినేషన్లు అడ్డుకుంటున్నారు.. బీహార్‌లో కూడా ఇంత నియంత పాలన సాగలేదు..
-
Shankarpally : మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!
-
AP Local Body Elections 2026: సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై కీలక చర్చ!
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!