సాధారణంగా ప్లీమియర్ విస్కీ బాటిల్ ఖరీదు రూ.10 వేల వరకు ఉంటుంది. అదే విదేశీ కంపెనీకి చెందిన బాటిల్ అయితే లక్షల్లో ఉండోచ్చు. కానీ, ఈ మద్యం బాటిల్ ఖరీదు మాత్రం ఏకంగా కోటి రూపాయలు పలికింది. ఇది మాములు విస్కీ బాటిల్ కాదు. సుమారు 250 ఏళ్ల క్రితం తయారు చేసిన బాటిల్. ఈ విస్కి బాటిల్ పేరు ఓల్డ్ ఇంగ్లెడ్వ్. దీనిని 1860 వ సంవత్సరంలో తయారు చేశారు. ఇంగ్లాండ్‌లోని ప్రముఖ వేలం సంస్థ స్కినార్ ఇంక్ ఈ బాటిల్‌ను వేలం నిర్వహించింది. అనుకున్న ధర కంటే ఆరురెట్లు అధిక ధరలకు అమ్ముడైందని వేలం సంస్థ ప్రకటించింది. ఈ బాటిల్‌ను మిడ్‌టౌన్ మన్హాటన్ మ్యూజియం, ది మోర్గాన్ పరిశోధన సంస్థ కలిసి ఈ బాటిల్‌ను 1,37,500 డాలర్లకు కోనుగోలు చేసింది.