North Korea: గ్రహాంతరవాసుల వల్లే కరోనా వ్యాప్తి.. కిమ్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తన వింత ప్రకటనలతో మరోసారి వార్తల్లో నిలిచారు. గ్రహాంతరవాసుల వల్లే కరోనా వ్యాపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు కూడా గ్రహాంతరవాసుల వల్లే వచ్చినట్లు తేలిందని చెప్పుకొచ్చారు. దక్షిణ కొరియాతో అనుసంధానమైన సరిహద్దు నుంచి గ్రహాంతరవాసులు ఈ వైరస్‌ను బెలూన్‌లో నింపి విసిరారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పటి నుంచి ఉత్తర కొరియాలో కరోనా వైరస్ విజృంభిస్తోందని తెలిపారు.
ఏప్రిల్‌లో 18 ఏళ్ల సైనికుడితోపాటు 5 ఏళ్ల చిన్నారి గ్రహాంతరవాసుల లాంటి వస్తువును తాకినట్లు ఉత్తర కొరియాలో పుకార్లు వ్యాపించాయి. ఆ తర్వాత ఆ ఇద్దరిలోనూ కరోనా లక్షణాలు కనిపించాయంట. అయితే పొరుగు దేశం దక్షిణ కొరియా మాత్రం గ్రహాంతరవాసుల నుంచి వ్యాపిస్తుందని వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. వస్తువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నందున కిమ్ జోంగ్ వాదనను నమ్మడం కష్టమని సియోల్‌లోని ఒక ప్రొఫెసర్ తెలిపారు.
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
Taliban: అఫ్గాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు.. విదేశీయులకు తాలిబన్ల హెచ్చరిక
సరిహద్దుకు ఆనుకుని ఉన్న ప్రాంతాలకు కిమ్ సర్కారు కొన్ని సూచనలను జారీ చేసింది. సరిహద్దుకు సమీపంలో నివసించే ప్రజలు గాలిలో అంటే బెలూన్లు, గ్రహాంతరవాసుల వంటి వాటి గురించి అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఎవరైనా అలాంటివి కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత కరోనా వైరస్ నుంచి బయటపడినట్లు పేర్కొన్న తర్వాత, ఏప్రిల్ చివరి నుంచి ఉత్తర కొరియాలో సుమారు రెండు మిలియన్ల మంది ప్రజలు వింత జ్వరంతో బాధపడుతున్నారు. మే 12 న, ఉత్తర కొరియా మొదటిసారిగా తమ దేశంలో కరోనావైరస్ కేసులు వచ్చినట్లు ప్రకటించింది.ఈ నేపథ్యంలో కిమ్ జోంగ్ దేశం మొత్తం లాక్‌డౌన్‌ను విధించారు. ఈ మేరకు ఉత్తర కొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!