ఆర్థిక నేరస్థుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్‌ను లండన్ కోర్టు మళ్లీ తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో భారత మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన నీరవ్ మోడీ 2019 మార్చి నుంచి యూకే జైల్లో ఉన్నాడు. అతని బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురి కావడం ఇది పదోసారి కావడం విశేషం. తాజా బెయిల్ పిటిషన్‌ను లండన్‌లోని కింగ్స్ బెంచ్ డివిజన్ హైకోర్టు తిరస్కరించిందని సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. లండన్‌కు వెళ్లిన సీబీఐ బృందం.. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ సహాయంతో బెయిల్ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించిందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని.. భారత ప్రభుత్వం నుంచి ప్రాణాలకు ముప్పు ఉందని.. అందుకే పారిపోయినట్లు నీరవ్ మోడీ పిటిషన్‌లో పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: IPL 2025: ప్లేఆఫ్స్‌కు బట్లర్ దూరం.. మయాంక్‌కు మళ్లీ గాయం!
ఇదిలా ఉంటే 2022లో నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించేందుకు యూకే హైకోర్టు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను నీరవ్ మోడీ రూ.13,000 కోట్లకు మోసం చేశాడు. అందులో రూ.6498.20 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక కుంభకోణం బయటపడటానికి కొన్ని వారాల ముందు నీరవ్ మోడీ 2018, జనవరిలో భారత్ నుంచి లండన్‌కు పారిపోయాడు. నీరవ్ మోడీతో పాటు పారిపోయిన అతని మామ మెహుల్ చోక్సీని గత నెలలో బెల్జియంలో అరెస్టు చేశారు. చోక్సీ కూడా తాను ఎటువంటి తప్పు చేయలేదని వ్యాఖ్యానించాడు. నీరవ్ మోడీపై మూడు సెట్ల క్రిమినల్ కేసులు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసినందుకు సీబీఐ కేసు, మనీలాండరింగ్‌లో ఈడీ కేసు ఉంది. ఇక సీబీఐ విచారణలో ఆధారాలు, సాక్షులతో జోక్యం చేసుకున్నందుకు మూడో కేసు ఉంది.
ఇది కూడా చదవండి: Israel-Hamas: గాజాలో ఇజ్రాయెల్ బాంబుల మోత.. 80 మంది పౌరులు మృతి..!
గతేడాది డిసెంబర్‌లో రూ.1,052.58 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం మరియు ప్రైవేటు బ్యాంక్‌లకు నీరవ్ మోడీ అప్పగించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2024, సెప్టెంబర్‌లో నీరవ్ మోడీ కంపెనీలకు సంబంధించి రూ.29.75 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఈ అటాచ్డ్ ఆస్తుల్లో స్థిరాస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఉన్నాయి. ఇక విదేశాల్లో రూ.2,596 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేయబడ్డాయి. 2018లో ముంబైలో రూ.692.90 కోట్లు జప్తు చేయబడ్డాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఆస్తులు అటాచ్ చేయబడ్డాయి.
Nirav Modi's bail petition rejected in London.
Source: Central Bureau of Investigation (CBI) pic.twitter.com/9Zw5b1AUau
— ANI (@ANI) May 15, 2025