Nigeria jailbreak: తీవ్రవాదుల దాడి.. 600 మంది ఖైదీలు పరార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇస్లామిక్ మిలిటెంట్ వ్యతిరేక ముఠా నైజీరియా రాజధాని అబూజలో ఉన్న ఓ కారాగారంపై దాడులకు తెగబడ్డారు. దీంతో.. దాదాపు 600 మంది ఖైదీలు పరారయ్యారు. అయితే, వీరిలో సుమారు 300 మందిని తిరిగి పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. మంగళవారం అర్థరాత్రి 10గంటల సమయంలో పక్కా ప్రణాళికతో వచ్చిన తీవ్రవాద ముఠాలు కుజీ కారాగారంపై భారీ పేలుడు పదార్థాలతో దాడికి తెగబడ్డారు. అక్కడ వున్న భద్రతా సిబ్బందిని హతమార్చిన దుండగులు, వారితో పాటు తీసుకు వచ్చిన పేలుడు పదార్థాలతో గోడలను కూల్చి లోనికి ప్రవేశించారు. అయితే.. వీరిని బోకో హరమ్‌గా పిలుస్తారని, ఇస్లామిక్ మిలిటెంట్ వ్యతిరేక ముఠాలే ఈ దాడులకు పాల్పడినట్లు నైజీరియా అంతర్గత వ్యవహారాల శాఖ కార్యదర్శి శువాయిబ్ బెల్గోర్ పేర్కొన్నారు.
read also: Bandi Sanjay : రాజ్యసభకు దక్షిణాది ప్రముఖులు.. ఆ ఘనత మోడీదే..
Also Read
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Strait of Hormuz: హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్‌లో పాల్గొననున్న జిన్‌పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
దానికి చెందిన వారు ఎక్కువ మంది ఖైదీలుగా ఉన్నారని, వారిని విడిపించుకు వెళ్లేందుకే దుండగులు ఈ పథకం రచించారని అన్నారు. అయితే.. ఇరభై కోట్లకుపైగా జనాభా కలిగిన నైజీరియాలో బోకోహరం ముఠాలు జైళ్లపై దాడులకు పాల్పడడం ఇటీవలి కాలంలో ఎక్కువైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో.. నైజీరియా రాజధానిలో చోటుచేసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. ఇలావుంటే.. ఈశాన్య నైజీరియాలో తీవ్రవాద ముఠాలు సృష్టిస్తోన్న నరమేధానికి ఇప్పటివరకు 35వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే.. ప్రాంతాలలో మిలిటెంట్ల దాడుల భయాలతో దాదాపు ఇరవై లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు ఐరాస గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. సుదీర్ఘ కాలంగా అక్కడ నెలకొన్న అస్థిరత వల్ల ఆకలి.. ఆరోగ్య సేవలలేమితో దాదాపు మూడు లక్షలకుపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!