Site icon NTV Telugu

US: ట్రంప్‌పై న్యూయార్క్ మేయర్ అభ్యర్థి మమ్దానీ ఘాటు వ్యాఖ్యలు

Mamdani Trump

Mamdani Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ట్రంప్.. మమ్దానీపై తీవ్రంగా స్పందించారు. తాజాగా మమ్దానీ రియాక్ట్ అయ్యారు. న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా భారత ముస్లిం సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ ఎన్నికయ్యారు. ప్రైమరీ ఎన్నికల్లో గెలుపొందారు. ఫైనల్ ఎన్నికల్లో గెలిస్తే న్యూయార్క్‌ మేయర్‌గా తొలి ముస్లిం వ్యక్తిగా మమ్దానీ రికార్డ్ సృష్టించనున్నాడు.

ఇది కూడా చదవండి: Bihar: బీహార్‌లో మరో దారుణం.. మామతో ఉండేందుకు భర్తను చంపేసిన నవ వధువు

అయితే జోహ్రాన్ మమ్దానీపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అతడో కమ్యూనిస్ట్ పిచ్చోడు.. తెలివిలేదంటూ విరుచుకుపడ్డారు. అంతేకాకుండా డెమొక్రాట్లపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ట్రంప్ స్వరం పెంచి.. మమ్దానీ అరెస్ట్ చేసి.. దేశం నుంచి వెళ్లగొడతామంటూ ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Avinash Group of Institutions: లేట్ ఫీజు పేరిట దోపిడి.. రెండ్రోజులు ఆలస్యమైందని పెనాల్టీగా రూ. 3000 వసూలు

తాజాగా ట్రంప్ వ్యాఖ్యలపై న్యూయార్క్‌లో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో మమ్దానీ ఘాటుగా స్పందించారు. అమెరికాలో వర్గ విభేదాలను రెచ్చగొట్టేందుకు ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వర్కింగ్ క్లాస్ పీపుల్స్‌ను ట్రంప్ మోసం చేశారని.. దాన్నుంచి అమెరికా ప్రజల దృష్టిని మరల్చేందుకు తనను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని చెప్పారు. తనను అరెస్ట్ చేయాలంటున్నారని.. న్యూయార్క్ నగరంలో తాము తరాలుగా ఉంటున్నట్లు గుర్తుచేశారు. దక్షిణాసియా మూలాలున్న ముస్లిం వ్యక్తి న్యూయార్క్ మేయర్‌గా నిలవబోతున్నట్లు చెప్పారు. నేనెవరో.. ఎక్కడి నుంచి వచ్చానో అనే దానికంటే తాను దేని కోసం పోరాడుతున్నానో దాన్నుంచి దృష్టి మళ్లించేందుకే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రిపబ్లికన్లపై తమ పోరాటం కొనసాగుతోందని జోహ్రాన్ మమ్దానీ హెచ్చరించారు.

 

Exit mobile version