Israel-India: ఇజ్రాయిల్ ప్రధాని చేతిలో భారత్ మ్యాప్.. నెతన్యాహూ ‘‘బ్లెస్సింగ్’’ ఉద్దేశం ఏమిటి..?
- ఇజ్రాయిల్ ప్రధాని చేతిలో భారత పటం..
- భారత్‌ని ‘‘దీవెన’’గా పోల్చిన బెంజమిన్ నెతన్యాహూ..
- ఇరాన్-ఇరాక్ ఈ ప్రపంచానికి శాపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-India: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. శుక్రవారం న్యూయార్క్‌లో యూఎన్‌లో మాట్లాడుతూ.. ఇరాన్, అది మద్దతు ఇస్తున్న హిజ్బుల్లా, హమాస్‌పై విరుచుకుపడ్డారు. అయితే, ఇప్పుడు నెతన్యాహూ ప్రదర్శించిన రెండు ఫోటోలు మాత్రం వైరల్‌గా మారాయి. అందులో ఇండియా మ్యాప్ కూడా ఉంది.
నెతన్యాహూ తన కుడి చేతిలో ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్ దేశాలతో కూడా మిడిల్ ఈస్ట్ దేశాల ఫోటోలను నలుగుపు రంగులో ఉన్నాయి. అదే విధంగా ఎడమ చేతిలో ఈజిప్ట్, సుడాన్, సౌదీ అరేబియాతో పాటు ఇండియా మ్యాప్ కూడా ఉండటం సంచలనంగా మారింది. ఈ దేశాలు గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. యూఎన్‌జీఏ వేదికగానే ఇరాన్‌కి నెతన్యాహూ వార్నింగ్ ఇచ్చారు. తమని రెచ్చగొడితే ఇరాన్‌లోని ఏ ప్రాంతంలోకైనా చేరుకోగలమని హెచ్చరించారు. ఇరాన్‌పై ఆంక్షలు విధించాల్సిన అవసరాన్ని చెప్పారు.
Also Read
Read Also: IND vs BAN: ఇండియాలో తొమ్మిదేళ్ల తర్వాత అనూహ్య పరిణామం..
ఐక్యరాజ్యసమితిలో నెతన్యాహూ భారత్‌ని ‘‘బ్లెస్సింగ్(దీవెన)’’గా, ఇరాన్‌ని ‘‘కర్స్(శాపం)’’గా అభివర్ణించారు. ఇజ్రాయిల్ ప్రధాని తన మిత్రదేశాలను ఆశీర్వాదంగా చూపించారు. నెతన్యాహూ ప్రదర్శించిన ‘‘బ్లెస్సింగ్’’ మ్యాప్‌లో ఇజ్రాయిల్‌తో బలమైన సంబంధాల ఉన్న దేశాలను హైలెట్ చేశారు. ‘‘చాలా కాలంగా ప్రపంచం ఇరాన్‌ని శాంతింపచేసింది. దాని అంతర్గత అణచివేతకు కళ్లు మూసుకుంది. ఆ బుజ్జగింపు ఇప్పుడు ముగియాలి’’ అని ప్రపంచానికి సూచించారు.
అయితే, నెతన్యాహూ ప్రసంగం సాగిస్తున్న సమయంలో పలు దేశాల దౌత్యవేత్తలు సభ నుంచి వాకౌట్ చేశారు. సౌదీ అరేబియాని గ్రీన్ కలర్‌లో సూచించడం, ఇటీవల కాలంలో ఇజ్రాయిల్-సౌదీల మధ్య బలపడిన బంధాన్ని హైలెట్ చేస్తుంది. ఇక ఇరాన్‌కి సౌదీ బద్ధశత్రువు. ఈ నేపథ్యంలోనే శత్రువుకి శత్రువు మిత్రుడనే ధోరణిని ఇజ్రాయిల్ ప్రదర్శించింది. బైడెన్ పరిపాలనతో అమెరికా ఈ రెండు దేశాల మధ్య స్నేహం కుదిరేలా మధ్యవర్తిత్వం చేసింది. హమాస్, హిజ్బు్ల్లాపై ఇజ్రాయిల్ దాడుల్ని సౌదీ ఏ రోజు వ్యతిరేకించలేదు.
ఇక భారత్- ఇజ్రాయిల్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇజ్రాయిల్, భారత్‌కి ‘‘ఆల్ వెదర్’’ ఫ్రెండ్‌గా ఉంది. ఇరు దేశాల ప్రజలు ఒకరపై ఒకరు అభిమానాన్ని కలిగి ఉన్నారు. టెక్నాలజీలో భారత్‌కి ఇజ్రాయిల్ మద్దతు ఉంది. కార్గిల్ యుద్ధంలో భారత్‌కి సహకరించిన విషయాన్ని ఎప్పుడూ మరిచిపోదు. ఇక ఈజిప్ట్ తో ఇజ్రాయిల్‌కి 1979 శాంతి ఒప్పందం కుదిరింది. ఈజిప్టు ప్రాంతీయ స్థిరత్వం ఇజ్రాయిల్ కి మద్దతు ఇస్తోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!