Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సినిమాల విషయంలో ఎంత నెమ్మదిగా అడుగులు వేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కథ తనకు పూర్తిగా నచ్చితేనే ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లే ఆమిర్.. గతంలో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి చేయాలనుకున్న సూపర్‌హీరో సినిమాను క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా పక్కన పెట్టారు. అయితే సూపర్‌హీరో కథపై మాత్రం ఆమిర్ వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. ఇప్పుడు అదే జానర్లో మరో భారీ ప్రాజెక్ట్ కోసం ఆయన చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
అందుతున్న సమాచారం ప్రకారం, నిర్మాత సాజిద్ నడియాద్వాలాతో కలిసి ఆమిర్ ఖాన్ ఒక ప్రతిష్టాత్మక సూపర్‌హీరో సినిమా గురించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి ఆర్. బాల్కి దర్శకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం. ‘పా’, ‘ప్యాడ్‌మ్యాన్’, ‘చుప్’ వంటి విభిన్నమైన కథలను తెరకెక్కించిన బాల్కి తొలిసారి ఆమిర్ ఖాన్‌తో పనిచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్టింగ్ ప్రక్రియలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆమిర్ ఖాన్ స్క్రిప్ట్ విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. పూర్తి స్క్రీన్‌ప్లే తనకు నచ్చిన తర్వాతే సినిమా విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకునే అలవాటు ఆయనది. అందుకే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నప్పటికీ, తుది స్క్రిప్ట్ ఆమిర్‌ను మెప్పిస్తేనే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆమిర్, సాజిద్ నడియాద్వాలా లేదా ఆర్. బాల్కి నుంచి ఈ సినిమాపై ఆఫీషియల్ ప్రకటన అయితే రాలేదు.
ఇదిలా ఉంటే ఆమిర్ ఖాన్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన సూపర్‌హీరో సినిమా గతంలోనే నిలిచిపోయింది. ‘కూలీ’లో ఆమిర్ అతిథి పాత్రలో కనిపించిన తర్వాత వీరిద్దరూ పూర్తి స్థాయి సినిమాకు కలిసి పనిచేయబోతున్నట్లు స్వయంగా ఆమిర్ కూడా వెల్లడించారు. కానీ ఆ తర్వాత స్క్రిప్ట్ విషయంలో ఇద్దరి వర్కింగ్ స్టైల్స్ కలవకపోవడంతో ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆమిర్ ఖాన్ దృష్టి ‘లల్కారా’పైనే ఉంది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో ఆమిర్ క్రికెట్ దిగ్గజం లాలా అమర్నాథ్ పాత్రలో కనిపించనున్నారు. 1952లో జరిగిన భారత్, పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఈ కథ సాగనుంది. ఆమిర్, గోవారికర్ ‘లగాన్’ తర్వాత మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఆమిర్ సినిమా కోసం భారీగా మేకోవర్ అవుతున్నారు. షూటింగ్ నవంబర్ 2026లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఒకవేళ ఆర్. బాల్కి, సాజిద్ నడియాద్వాలాతో ఆమిర్ ఖాన్ సూపర్‌హీరో సినిమా నిజంగా పట్టాలెక్కితే.. ఇంతకాలం ఆమిర్ నుంచి చూడని ఒక కొత్త జానర్లో ఆయనను చూసే అవకాశం ఉంటుంది. అయితే ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉండటంతో అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిని రూమర్‌గానే చూడాలి.
- Tags
- Aamir Khan
- cinema
తాజావార్తలు
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!