Netanyahu: ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
- ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
- అంర్జాతీయంగా చర్చనీయాంశంగా వ్యాఖ్యలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు లేదా ఎల్లుండి ఏమవుతుందో చూడాలంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేయ్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. అయితే పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాని ప్రధాని నెతన్యాహుతో కలిసి ప్రెస్‌మీట్‌కు హాజరయ్యారు. జేవియర్ మిలేయ్ కుర్చీలో కూర్చోగా.. నెతన్యాహు మాట్లాడుతూ.. జేవియర్ మిలేయ్ ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చినప్పుడల్లా పెద్ద పరిణామాలు జరుగుతుంటాయని.. రేపు లేదా ఎల్లుండి ఏమవుతుందో చూడాలంటూ వ్యాఖ్యానించారు. నెతన్యాహు నోట నుంచి ఆ మాటలు రాగానే జేవియర్ మిలేయ్ పగలబడి నవ్వుకున్నారు. చాలా సేపు నవ్వుతూనే కనిపించారు.
Also Read
- Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
- Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
- Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
- MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
రెండేళ్లలో జేవియర్ మిలేయ్ ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇది మూడోసారి. జేవియర్ మిలేయ్కు ఇజ్రాయెల్‌లో ఘన స్వాగతం లభించింది. ఇరువురు నేతలు స్నేహపూర్వకంగా సమావేశమయ్యారు. ‘‘జేవియర్’’ అనే పేరు హీబ్రూ భాషలో ‘‘చావేర్’’ (స్నేహితుడు) అనే పదానికి దగ్గరగా ఉంటుందని నెతన్యాహు సరదాగా వ్యాఖ్యానించారు.
ఇరాన్‌పై ఉమ్మడి వ్యూహం..
ఇరు దేశాలు ఐజాక్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. భద్రత, కృత్రిమ మేధస్సు (AI) రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడమే దీని లక్ష్యం. స్వేచ్ఛా దేశాల మధ్య కొత్త కూటమికి నాంది అని నెతన్యాహు అన్నారు. ఈ ఒప్పందం ద్వారా ఇరాన్ ప్రభావాన్ని అడ్డుకోవడంపై కూడా ఇరు దేశాలు దృష్టి పెట్టనున్నాయి. వాణిజ్యం, సాంకేతికత, ఇన్నోవేషన్ రంగాల్లో భాగస్వామ్యం పెంచుకోవాలని నిర్ణయించారు. ఇక పర్యటనలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టెల్ అవీవ్ నుంచి అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఐరీస్కు నేరుగా విమాన సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ నాటికి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రయాణ సమయం సుమారు 15-16 గంటలకు తగ్గనుంది. అలాగే అర్జెంటీనా తన రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు మార్చే ప్రణాళికను మిలేయి మరోసారి పునరుద్ఘాటించారు.
نتانیاهو:
هر بار که خاویر مایلی از اسرائیل بازدید میکند، درست قبل از وقوع اتفاق بزرگی است.
چه کسی میداند فردا یا پسفردا چه اتفاقی خواهد افتاد؟ pic.twitter.com/eAJncCmD8Y
— Big Boss News 🇮🇷 (@boss_big666) April 19, 2026
తాజావార్తలు
-
NSE Listing: బీఎస్ఈలో ఎన్ఎస్ఈ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ అయిన గంటలోనే కోటి షేర్లు ట్రేడ్!
-
Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
-
DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
-
CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
-
Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!