Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
- 5.8 తీవ్రతతో టర్కీలో భూకంపం
- రంగంలోకి AFAD బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey Earthquake Today: టర్కీలో గురువారం మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రత నమోదైనట్లు ప్రాథమిక సమాచారం. భూకంపం కారణంగా దియార్బకిర్, అదియమాన్, షాన్లియుర్ఫా సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ముఖ్యంగా దియార్బకిర్లో భూకంప ప్రభావం ఎక్కువగా కనిపించినట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి.
తొలుత 5.5గా అంచనా.. ఆ తర్వాత 5.8
భూకంపం సంభవించిన వెంటనే దాని తీవ్రతను 5.5గా అధికారులు అంచనా వేశారు. అనంతరం సవరించిన అంచనాల ప్రకారం తీవ్రత 5.8గా వెల్లడైంది. భూకంపం ప్రభావంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రకంపనలు షాన్లియుర్ఫాతో పాటు అదియమాన్, మలత్యా, దియార్బకిర్, గాజియాంటెప్ ప్రాంతాల్లో కూడా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంపం తర్వాత టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ సంస్థ AFAD పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ప్రభావిత ప్రాంతాల్లో ఫీల్డ్ స్కానింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read
- Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
- Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
- Pakistan Airspace Ban: భారత విమానాలపై పాకిస్తాన్ ఆంక్షలు.. గగనతల నిషేధం పొడిగింపు..
- Russia-US: డీజిల్ డీల్ తర్వాత.. అమెరికా-రష్యా మధ్య మరో భారీ ఒప్పందం..!
ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం లేదు
ప్రస్తుతం అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం భూకంపం కారణంగా ఎవరైనా మరణించినట్లు లేదా గాయపడినట్లు సమాచారం లేదు. అలాగే భారీ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పటివరకు వెలువడలేదు. అయితే భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పరిస్థితిని పూర్తిగా అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బృందాలు పర్యటిస్తూ భవనాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలిస్తున్నాయి.
పరిస్థితిపై అధికారుల నిఘా
భూకంపం తర్వాత ఎలాంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తలేదని AFAD ప్రాథమికంగా తెలిపింది. అయినప్పటికీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షణ కొనసాగుతోంది. భూకంపం వల్ల జరిగిన నష్టం, ప్రజల పరిస్థితిపై మరింత స్పష్టమైన సమాచారం అధికారుల పూర్తి స్థాయి పరిశీలన అనంతరం వెలువడే అవకాశం ఉంది.
Korkutan ses ve şiddetli sarsıntıyla vatandaşlar kendilerini dışarı attı! İlk bilgilere göre sevindirici haber: Herhangi bir yıkım yok.#Deprem #SonDakika #Sallandık #GeçmişOlsun pic.twitter.com/CGEVeIRexF
— OZAN ÖZTÜRK (@ozanozturk_tr) September 24, 2026
తాజావార్తలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!