Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Floods: హిమాలయ దేశం నేపాల్‌ను మరోసారి ప్రకృతి ప్రళయం వణికిస్తోంది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టి వానలకు కొండచరియలు విరిగిపడి, నదులు ఉగ్రరూపం దాల్చడంతో దేశం అతలాకుతలమవుతోంది. కేవలం గడిచిన మూడు రోజుల్లోనే జల ప్రళయానికి 24 మంది దుర్మరణం పాలవ్వగా, మరో 15 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. కొండ ప్రాంతాల్లోని ఇళ్లు క్షణాల వ్యవధిలోనే మట్టి దిబ్బలుగా మారిపోతున్న హృదయ విదారక దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా కాళీ, గండకి, నారాయణి, టినౌ, సున్ కోషి, మహాకాళి నదులు ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి ఉరకలెత్తుతున్నాయి. వరద తీవ్రత ఊహకందని స్థాయికి చేరడంతో మధ్య, పశ్చిమ, తూర్పు నేపాల్ ప్రాంతాల ప్రజలకు అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కాళీ గండకీ నది పోటెత్తడంతో స్యాంగ్జా సమీపంలోని 144 మెగావాట్ల మీర్మీ జలవిద్యుత్ డ్యామ్ గేట్లను పూర్తిగా ఎత్తివేసి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు.
Also Read
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
- Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
వరదల ధాటికి వందలాది ఇళ్లు కొట్టుకుపోవడంతో పాటు రహదారులు, కీలక వంతెనలు తెగిపోయి గ్రామాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దాదాపు 1,500 మందికి పైగా నిరాశ్రయులుగా మారగా, లోతట్టు ప్రాంతాల ప్రజలను రెస్క్యూ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. గత నెలలో సంభవించిన వరదల మిగిల్చిన 1,453 మంది మరణాల విషాదం నుంచి తేరుకోకముందే, మళ్లీ వరదలు ముంచెత్తడంతో నేపాల్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!