ఈ విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు ఉన్నాయా లేవా, ఉంటే వాటిపై జీవం ఉన్నదా లేదా? జీవం ఉంటే వాటి మనుగడ ఎలా ఉన్నది తదితర విషయాలను తెలుసుకొవడానికి నాసా ఎప్పటినుంచో ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నాసా మార్స్ మీదకు రోవర్‌ను పంపింది. రోవర్ పర్సెవరెన్స్ ఇప్పటికే మార్స్‌పై పరిశోధనలు చేస్తున్నది. మార్స్ మీదున్న వాతావరణానికి సంబందించిన ఫొటోలను ఎప్పటికప్పుడు తీసి భూమి మీదకు పంపుతున్నది. అయితే, నాసా పంపిన రోవర్ రాళ్లను డ్రిల్ చేసి వాటి నమూనాలను భూమి మీదకు పంపాలి. అయితే, ఈ ప్రయత్నంలో రోవర్ విఫలం అయింది. డ్రిల్ చేసినప్పటికీ వాటి నమూనాలను రోవర్ సేకరించలేకపోయింది. ప్రయత్నం విఫలం అయినప్పటికీ..కొత్త ప్రయోగాల్లో ఇలాంటి విఫలం మామూలే అని భవిష్యత్తులో తప్పని సరిగా విజయవంతం అవుతుందని నాసా రోవర్ మిషన్ డైరెక్టర్ పేర్కొన్నారు.
Read: వ్యాక్సినేషన్‌లో భారత్ కొత్త రికార్డు..50 కోట్లు క్రాస్