Elon Musk: భార్య, కొడుకు గురించి ఇంట్రెస్టింగ్ మేటర్ చెప్పిన మస్క్
- పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న టెస్లా అధినేత మస్క్
- భార్య, కొడుకు గురించి కీలక విషయాలు పంచుకున్న మస్క్
- కుమారుడికి భారతీయ శాస్త్రవేత్త పేరు పెట్టినట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్లా అధినేత, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ తన భాగస్వామి గురించి కీలక విషయాలు పంచుకున్నారు. జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో మస్క్ పాల్గొని పలు కీలక విషయాలు పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: MK Stalin: రాజ్ భవన్ పేరు మార్పుపై వివాదం.. తీవ్ర విమర్శలు చేసిన సీఎం స్టాలిన్…
Also Read
భాగస్వామి శివోన్ జిలిస్ ఎక్కడ పెరిగిందని కామత్ అడిగినప్పుడు మస్క్ సమాధానం ఇస్తూ.. ఆమె పూర్వీకులు భారతీయులని.. శిశువుగా ఉన్నప్పుడే దత్తత కోసం ఇవ్వబడిందని చెప్పారు. తనకు కచ్చితమైన వివరాలు తెలియకపోయినా.. శిశువుగా ఉన్నప్పుడు మాత్రం దత్తత ఇవ్వబడిందనే విషయం మాత్రం కచ్చితమని.. అనంతరం కెనడాలో పెరిగినట్లు వివరించారు. అలా ఆమె ఇండియన్-అమెరికన్ అయిందని తెలిపారు. అంతేకాకుండా ఒక కొడుకు పేరు శేఖర్ అని కూడా చెప్పారు. ఇండియన్-అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్‌లోని శేఖర్ అనే పదాన్ని ఒక కుమారుడికి పెట్టినట్లుగా వివరించారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : రాష్ట్రం 3 విభాగాలుగా వర్గీకరణ.. ఔటర్ ఔట్‌సైడ్ కొత్తగా రీజినల్ రింగురోడ్డు
జిలిస్ 2017లో మస్క్‌కు చెందిన ఐఏ కంపెనీ న్యూరాలింక్‌లో చేరారు. ప్రస్తుతం ఆపరేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేస్తు్న్నారు. యేల్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్, ఫిలాసఫీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్స్ట్ పట్టా పొందారు. జిలిస్-మస్క్ దంపతులకు మొత్తం నలుగురు పిల్లలు, ఇద్దరు కవలలు స్ట్రైడర్, అజూర్, కుమార్తె ఆర్కాడియా, మరో కుమారుడు సెల్డాన్ లైకుర్గస్ ఉన్నారు. ఒక కొడుకు పేరులో శేఖర్‌ను చేర్చారు.

ఇక పాడ్‌కాస్ట్‌లో మస్క్ మరికొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అమెరికా అపారమైన ప్రయోజనం పొందిందని తెలిపారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారినట్లుగా చెప్పారు. వీసా ఆంక్షల తర్వాత భారతీయులకు ఇబ్బందులు తలెత్తినట్లుగా పేర్కొన్నారు.
Out now @elonmusk pic.twitter.com/dQVLniUgWA
— Nikhil Kamath (@nikhilkamathcio) November 30, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!