Donald Trump: ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ ఓ నియంత..
- ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ ఓ నియంత అంటూ అమెరికా అధ్యక్షుడు విమర్శలు..
- కాస్త భూమితో పోయేదాన్ని జెలెన్స్కీ యుద్ధం వరకూ తెచ్చారు..
- ఉక్రెయిన్ మూలంగా మూడేళ్లు యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది: డొనాల్డ్ ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఓ నియంత.. అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డాడు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే కీవ్ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ తెచ్చారని విమర్శించాడు. ఇప్పుడు ఎక్కువ ల్యాండ్ సహా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. యుద్ధానికి ఉక్రెయినే ప్రధాన కారణం, అది మొదలు కావడానికి ముందే ఒప్పందం చేసుకుంటే సరిపోయేదన్నారు. మూడేళ్లుగా ఆ పనిని ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేశాడు. ఒక్కసారి ఆలోచించండి.. జెలెన్స్కీ అమెరికాతో మాట్లాడి 35,000 కోట్ల డాలర్లను యుద్ధంపై ఖర్చు పెట్టించాడు.. అది మాస్కోపై ఎప్పటికీ గెలవలేదు.. నేను లేకుండా ఆ యుద్ధాన్ని ఎవరు కొలిక్కి తీసుకురాలేరని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
Read Also: Delhi CM Oath Ceremony: నేడే ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోడీ
Also Read
- China: కొత్త గేమ్‌కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్‌పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్‌కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
ఇక, సౌదీ అరేబియా వేదికగా అమెరికా-రష్యా మధ్య జరుగుతున్న చర్చల్లో ఉక్రెయిన్ను భాగస్వామిగా చేయకపోవడంపై వచ్చిన విమర్శలను డొనాల్డ్ ట్రంప్ కొట్టి పారేశారు. శాంతి చర్చల్లో తాము పాల్గొనబోమని జెలెన్స్కీ చేసిన కామెంట్స్ పై తీవ్రంగా మండిపడ్డాడు. ఉక్రెయిన్ను వారికి ఇప్పించేలా నేను ప్లాన్ చేస్తుంటే.. అతడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటిని ప్రశ్నించారు. బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఆయనకే అర్థం కాలేదని ట్రంప్ విమర్శించారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య బుద్ధిలేని యుద్ధం జరుగుతుంది.. దీనిని ఆపాలని రష్యా కోరుకుంటోందని వెల్లడించారు. ఇక, జెలెన్స్కీకి కేవలం 4 శాతమే ప్రజల మద్దతు ఉందన్నారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఉక్రెయిన్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. రష్యా చేస్తున్న దుష్ప్రచారంలో అమెరికా అధినేత జీవిస్తున్నారని జెలెన్స్కీ అన్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!