SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
- ఉగ్రవాదం ఎప్పటికీ వ్యూహాత్మక ఆస్తి కాదు
- పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
- షాంఘై సహకార సంస్థ సదస్సులో మోడీ ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని మోడీ ఉగ్రవాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా ఉపయోగించే దేశాలు, ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు ఇచ్చే దేశాలకు అంతర్జాతీయ సమాజం గట్టి సందేశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. “ఉగ్రవాదం ఎప్పటికీ వ్యూహాత్మక ఆస్తి కాదు” అని మోడీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎస్సీవో దేశాధినేతలను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని తమ విధానాలను అమలు చేసేందుకు సాధనంగా ఉపయోగించే దేశాలను ఉపేక్షించకూడదన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, వారికి మద్దతు ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడే దేశాలకు అంతర్జాతీయ సమాజం నుంచి గట్టి హెచ్చరిక వెళ్లాలని అన్నారు. “ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు చోటు లేదనే విషయాన్ని మనమంతా ఒకే గొంతుతో చెప్పాలి. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా ఉపయోగించే దేశాలు, ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు ఇచ్చే దేశాలకు ఉగ్రవాదం వ్యూహాత్మక ఆస్తి కాదనే బలమైన సందేశం ఇవ్వాలి” అని మోడీ పేర్కొన్నారు.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
ఉగ్రవాద వ్యవస్థను నిర్మూలించాలి
ఉగ్రవాదానికి సంబంధించిన మొత్తం వ్యవస్థను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాదుల నియామకం, తీవ్రవాద భావజాలం వైపు మళ్లించడం, వారికి సురక్షిత స్థావరాలు కల్పించడం వంటి అన్ని అంశాలపై దేశాలు కలిసి పనిచేయాలని సూచించారు. 2025లో జరిగిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో మోడీ తాజా వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్య చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రవాదంపై భారత్ వైఖరిని మోడీ మరోసారి స్పష్టం చేశారు. మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుల్లో దేశాల మధ్య సహకారం అవసరమని మోడీ అన్నారు. అయితే ఇలాంటి ప్రాజెక్టులు ఇతర దేశాల సార్వభౌమ భూభాగాన్ని గౌరవించేలా ఉండాలని స్పష్టం చేశారు.
బిష్కెక్లో జరిగిన ఈ సమావేశానికి మోడీ, షెహబాజ్ షరీఫ్తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో, కజకిస్థాన్ అధ్యక్షుడు కాసిమ్-జోమార్ట్ టోకయేవ్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్, తజికిస్థాన్ అధ్యక్షుడు ఎమోమాలి రహ్మాన్ తదితరులు హాజరయ్యారు.
2001లో ఏర్పడిన SCO
పరస్పర విశ్వాసం, స్నేహం, పొరుగు దేశాలతో సత్సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు వివిధ రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని ప్రోత్సహించడం SCO ప్రధాన లక్ష్యాలు. 2001లో చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలతో ఈ సంస్థ ఏర్పడింది. 2017లో భారత్, పాకిస్థాన్ పూర్తిస్థాయి సభ్యదేశాలుగా చేరాయి. 2023లో ఇరాన్, 2024లో బెలారస్ సభ్యదేశాలుగా చేరాయి.
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!