Israel-Hamas: కాల్పుల విరమణ గడువుకు కొన్ని నిమిషాల ముందు.. సంధి ఒప్పందం పొడగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas: ఇజ్రాయిల్-హమాస్ మధ్య 50 రోజలు యుద్ధం తర్వాత ప్రస్తుత కాల్పుల విరమణ కొనసాగుతుంది. ఇరు పక్షాల కూడా బందీలను, ఖైదీలను మార్చుకుంటున్నాయి. తాజాగా గురువారం ఉదయంతో సంధి ముగిసేందుకు కొన్ని నిమిషాల ముందు.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడగిస్తున్నట్లు, సంధి కాలాన్ని పెంచినట్లు ఇరు పక్షాలు ప్రకటించాయి. ఖతార్ వేదికగా ఈ ప్రకటన వెలువడింది. ఇజ్రాయిల్ సైన్యం సంధిని పొడగిస్తు్న్నట్లు తెలిపింది.
బందీలను విడుదల చేసే ప్రక్రియ కొనసాగించేందుకు మధ్యవర్తుల ప్రయత్నాల నేపథ్యంలో నిబంధనలకు లోబడి కార్యాచరణ విరామం కొనసాగుతుందని ఇజ్రాయిల్ ఆర్మీ పేర్కొంది. ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం కూడా పొడగింపును ధృవీకరించింది. బందీలుగా ఉన్న వారి కొత్త జాబితాను విడుదల చేసింది. గత శుక్రవారం ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ఒప్పందం కుదిరింది. ముందుగా నాలుగు రోజులు అనుకున్నప్పటికీ మరో రెండు రోజులు పొడగించారు. ప్రస్తుతం మరోసారి సంధిని పొడగించారు.
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
ఇదిలా ఉంటే అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ బుధవారం రాత్రి ఇజ్రాయిల్ చేరుకున్న కొన్ని గంటల తర్వాత విరామం పొడగింపు ప్రకటన వెలువడింది. అంతకుముందు ఖతార్ ప్రధానితో యూఎస్ సీఐఏ, ఇజ్రాయిల్ మొసాద్ అధికారులు భేటీ అయి సంధి పొడగింపు గురించి చర్చించారు. దీనికి ముందు ఖతార్ కూడా హమాస్ నేతలతో చర్చలు జరిపింది.
అక్టోబర్7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేశారు. 1200 మంది హతమార్చారు. మరో 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై భీకరదాడి చేస్తోంది. ఈ దాడుల్లో 16000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో 40 శాతం మంది పిల్లలు ఉండటంపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాల్పుల విమరణ కోసం ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇరు పక్షాలు సంధి ఒప్పందానికి అంగీకరించాయి.
తాజావార్తలు
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!