క్రిస్మస్ పండగ వేళ కాలిఫోర్నియాను భారీ వరదలు ముంచెత్తాయి. తుఫాను కారణంగా కుండపోతగా వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లల్లోకి వరద నీరు ప్రవేశించింది. ఇక నీటి ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. ఇక వరదలు కారణంగా క్రిస్మస్ సందడి కాస్త చప్పబడిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు.

బుధవారం శక్తివంతమైన తుఫాను కారణంగా భారీ ఈదురుగాలులతో పాటు వర్షం కురిసిందని అధికారులు చెప్పారు. ఇక వరదలు కారణంగా ప్రధాన రహదారులను అధికారులు మూసేశారు. ఇక కొండచరియలు విరిగిపడడంతో సమీప ప్రాంతాలు బురదమయం అయ్యాయి. ఇక విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. ఇక చెట్లు రోడ్లపై కూలిపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Karnataka: కర్ణాటకలో ఘోర ప్రమాదం. 17 మంది సజీవ దహనం
