Delhi: 4 ఏళ్ల బాలికపై ప్యూన్ అఘాయిత్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: దేశంలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. అభంశుభం తెలియని చిన్నారులు పాలిట మృగాళ్లు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు ఉన్నా కూడా కామాంధులు జంకడం లేదు. దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలిసిన వారి నుంచే ఈ రకమైన వేధింపులను ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే ఢిల్లీలో 4 ఏళ్ల విద్యార్థినిపై స్కూల్ ఫ్యూన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బుధవారం దక్షిణ రోహిణి పోలీస్ స్టేషన్ వచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. రోహిణిలోని ఓ పాఠశాలలో ప్యూన్‌గా పనిచేస్తున్న 43 ఏళ్ల వ్యక్తిని నాలుగేళ్ల బాలికపై వేధింపులకు పాల్పడినందుకు గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన కుమార్తెపై వేధింపులకు పాల్పడినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
Read Also: Karnataka Elections: కర్ణాటక ఎన్నికల ఓటింగ్ శాతంలో రికార్డ్..1952 తర్వాత ఇదే తొలిసారి..
వేధింపులకు పాల్పడిన వ్యక్తికి మీసాలు ఉంటాయని కొన్ని గుర్తులను బాలిక పోలీసులకు చెప్పింది. బాలిక మే 1న పాఠశాలలో చేరింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం చిన్నారి చెప్పిన ఆధారాలతో పోలీసులు స్కూల్ లో ప్యూన్ గా పనిచేస్తున్న సుల్తాన్‌పురికి చెందిన సునీల్‌కుమార్(43)ని అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 బీ, పోక్సో చట్టం సెక్షన్ 10 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!