ఆప్ఘనిస్థాన్‌ను భారీ భూకంపం వణికించింది. భూప్రకంపనలకు తాలిబన్ల దేశం చిగురుటాకులా వణికిపోయింది. ఆదివారం అర్ధరాత్రి 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి 500 మంది మరణించారు. మరో 1,000 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగేే ఛాన్స్ ఉందని అధికారులు తెలియజేశారు. ఇక ఈ విపత్తుపై యూఎన్ విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలందరూ గాఢనిద్రలో ఉండగా భూకంపం రావడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: పాక్ ప్రధాని షెహబాజ్‌కు మోడీ బిగ్ షాక్.. పట్టించుకోని ప్రధాని
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11:47 గంటలకు ఈ భూకంపం వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 12:47 గంటలకు నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్‌లో 160 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించింది. పాకిస్థాన్, ఉత్తర భారతదేశంతో సహా అనేక ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు సంభవించాయి, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఇతర నగరాల్లో కూడా ప్రకంపనలుు వచ్చినట్లుగా ప్రజలు తెలిపారు. భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.
ఇది కూడా చదవండి: PM Modi: మోడీ-పుతిన్-జిన్‌పింగ్ సంభాషణ.. ఎక్స్‌లో ఫొటోలు పెట్టిన మోడీ
భారతదేశంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కానీ ఇక్కడ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. భయాందోళనకు గురై ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఆందోళనకు గురైనట్లు ప్రజలు తెలిపారు.

The UN in Afghanistan is deeply saddened by the devastating earthquake that struck the eastern region & claimed hundreds of lives, injuring many more. Our teams are on the ground, delivering emergency assistance & lifesaving support. Our thoughts are with the affected communities pic.twitter.com/rCE6b3WzSU
— UN Afghanistan (@unafghanistan) September 1, 2025