Man helps wife with makeup during match in the stadium: మహిళల మేకప్ గురించి మగాళ్లు చాలానే కామెంట్స్ చేస్తుంటారు. ఒక్కసారి మేకప్ చేయడం ప్రారంభిస్తే గంటల తరబడి వెయిట్ చేయాల్సిందని మగాళ్లు వాపోతుంటారు. కానీ.. ఈ వీడియో చూస్తే మాత్రం భర్తలు, భార్యల మేకప్ కోసం ఎంత సాయం చేస్తారో తెలుస్తోంది. స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో భార్య మేకప్ కు సహాయం చేస్తున్న భర్త వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Read Also: Fish Eggs Benefits: చేప గుడ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
‘హస్బెండ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఇవ్వాలని నెటిజెన్లు కోరుతున్నారు. కొంతమంది అతని పరిస్థితిని చూసి జాలి పడుతుంటే.. మరికొంత మంది సో స్వీట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు 14 వేల వ్యూస్ వచ్చాయి. ఈ భార్యభర్తల వీడియో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. స్టేడియంలో భర్తతో కలిసి మ్యాచ్ చూస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. భార్య మేకప్ కోసం భర్త ఫోన్ ఫ్రంట్ కెమరాను పట్టుకుని ఆమె మేకప్ చేసుకోవడానికి సహాయం చేస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఇలా చేస్తున్న క్రమంలో కెమెరా మెన్ కంటికి ఇలా చిక్కారు. నెటిజెన్లలో కొంతమంది భార్యను విమర్శిస్తుంటే.. మరికొంతమంది భర్తను మెచ్చుకుంటున్నారు.
https://twitter.com/Gulzar_sahab/status/1603605410539524097