కరోనా మహమ్మారి బారిన పడి కోలుకోవడమే కష్టంగా మారిన సమయంలో ఓ పెద్దాయన ఏకంగా 42 సార్లు కరోనా బారిన పడ్డారు. 42 సార్లు ఆయకు పరీక్షల్లో పాజిటీవ్‌గా తేలింది. వైద్యులు సైతం చేతులెత్తేశారు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఆయన హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆ వ్యక్తికి 2019లో కీమోథెరపీ చేయడంతో రోగనిరోధక శక్తి మరింత తగ్గింది. ఆ తరువాత 2020 మార్చి నెలలో మొదటిసారి కరోనా సోకింది. ఏప్రిల్నెలలో ఆయన ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులు ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యాడు. ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే మళ్లీ ఆయనకు కరోనా సోకింది. ఆసుపత్రిలో చేరిన డేవ్ స్మిత్ కు పరీక్షలు నిర్వహించిన వైద్యులు షాక్ అయ్యారు.
Read: అర్జున్ కపూర్ బర్త్ డే పార్టీలో… ‘అర్జున్ రెడ్డి’!
ఆయన శరీరంలో ఉన్నది మృత కరోనా ఆర్ఎన్ఏ కాదని, సజీవ కరోనా ఆర్ఎన్ఏ ఉందని వైద్యులు గుర్తించారు. శరీరంలో నుంచి కరోనా వైరస్ పూర్తిగా బయటకు వెళ్లలేదని గుర్తించిన వైద్యులు చికిత్స చేయడం మొదలుపెట్టారు. గతేడాది జులై నుంచి ఆయన దాదాపుగా 42 సార్లు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటీవ్ అని తేలింది. నాలుగైదుసార్లు కరోనా నుంచి కోలుకోవడం కష్టం అని, వైద్యులు చెప్పగా పాపం కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా ఎట్టకేలకు కోలుకొని డేవ్ స్మిత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. యూకేలోని బ్రిస్టల్ నగరానికి చెందిన ఈ డేవ్ స్మిత్ 310 రోజులపాటు కరోనాతో ఫైట్ చేసి రికార్డ్ సాధించాడు.