మలాలా ఈ పేరు తెలియని వ్యక్తులు ఉండరు. 2012 లో పాక్‌లోని స్వాత్ లోయలో స్కూల్ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో తాలిబన్లు బస్సును అటకాయించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మలాలా తలకు గాయమైంది. వెంటనే మలాలాను పెషావర్ తరలించి వైద్యం అందించారు. అక్కడి నుంచి బ్రిటన్ తరలించి వైద్యం అందించారు. గాయం నుంచి కోలుకున్న తరువాత మలాలా బాలికల చదువుకోసం పోరాటం చేస్తున్నారు. మలాలా ఫండ్ పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పాక్‌లోని…
ఆఫ్ఘన్‌లో పరిస్థితులపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్లు కాల్పులు జరిపి… 9 ఏళ్లు పూర్తవుతున్నా… ఓ బుల్లెట్ గాయం నుంచి కోలుకోలేకపోతున్నానని మలాలా తెలిపారు. గత 40 సంవత్సరాలుగా దేశ ప్రజలు… లక్షల కొద్దీ బుల్లెట్లను ఎదుర్కొంటూనే ఉన్నారని వెల్లడించారు. ఆఫ్ఘన్‌లో తొలి ప్రావిన్స్‌ను ఆక్రమించుకున్న సమయంలో మలాలాకు సర్జరీ జరిగింది. ఆ ఆపరేషన్ నుంచి ఇటీవలే కోలుకున్న ఆమె.. ప్రస్తుత ఆఫ్ఘన్ పరిస్థితులపై స్పందించారు. తాలిబన్ల చర్యలతో…
తాలిబన్లు రెండోసారి ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నారు. 1994లో మొదటిసారి తాలిబన్లు ఆఫ్ఘన్ దురాక్రమణకు పూనుకోవడం, 1996లో అధికారంలోకి రావడంతో ఆక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చెప్పక్కర్లేదు. ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే కాకుండా పాక్‌లోనూ తాలిబన్లు వారి ఉనికిని చాటుకున్నారు. 9 ఏళ్ల క్రితం తాలిబన్లు పాక్‌లోని క్వెట్టా ప్రాంతంలోకి ప్రవేశించి స్కూల్ బస్సుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో విద్యార్ధిని మలాలా యూసెఫ్‌జాయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ తరువాత ఆమెను పెషావర్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అక్కడి…