Kim Jong Un: ఉత్తర కొరియా ఒక నిగూఢ దేశం. ఆ దేశ ప్రజలకు బయట మరో ప్రపంచం ఉందని కూడా తెలియదు. అలా అక్కడ కిమ్ జోంగ్ ఉన్ తన ఉక్కు పాలనను కొనసాగిస్తున్నారు. చిత్రవిచిత్రమైన చట్టాలు, కఠినమై రూల్స్, క్షిపణి ప్రయోగాలకు కేరాఫ్‌గా ఉంది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ ప్రజలు, సైన్యం, అధికారులకు దైవ సమానుడు. కిమ్ మాత్రమే కాదు కిమ్ నాన్న, తాతలను కూడా ఉత్తర కొరియా గౌరవించాల్సిందే. ఎవరైనా నిరాకరిస్తే వాడి చావు జైలు లోనే.
ఇలాంటి దేశంలో వారసత్వ మార్పు గురించి జోరుగా చర్చ నడుస్తోంది. కిమ్ కుమార్తె జు ఏ తన తాతా, ముత్తాతల భౌతిక అవశేషాలు ఉన్న మౌసోలియం(సమాధిని) సందర్శించారు. తొలిసారిగా ఆమె బహిరంగంగా సందర్శించడం ఆసక్తికరంగా మారింది. శుక్రవారం ఆ దేశ స్టేట్ మీడియా ఈ చిత్రాలను చూపించింది. కిమ్ కుటుంబం దశాబ్ధాలుగా ఉత్తర కొరియనను ఉక్కు పిడికిలితో పాలిస్తోంది. ప్రస్తుతం నాయకుడు కిమ్ జోంగ్ ఉన్, తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్, తాతా కిమ్ ఇల్ సంగ్ తర్వాత దేశాన్ని పాలిస్తున్న మూడో వ్యక్తి.
శాశ్వత నాయకులుగా పిలుబడే కిమ్ తండ్రి, తాతల సమాధులు రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని కుమ్సుసాన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్‌లో ఉన్నాయి. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) కిమ్ జోంగ్ ఉన్ ఉన్నతాధికారులతో కలిసి ప్యాలెస్‌ను సందర్శించినట్లు నివేదించింది. ఏజెన్సీ విడుదల చేసిన చిత్రాలలో కుమార్తె జు ఏ అతని పక్కన కనిపించింది. గతేడాది తన తండ్రితో కలిసి చైనా పర్యటనక వెళ్లింది జు ఏ. అప్పటి నుంచి ఆమె తదుపరి ఉత్తరకొరియా పాలకురాలిగా భావిస్తు్న్నట్లు దక్షిణ కొరియా గూఢచార సంస్థ తెలిపింది.
2022లో తొలిసారిగా ఆమె ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగానికి హాజరైంది. అప్పుడే జు ఏ తొలిసారిగా ప్రపంచానికి పరిచమైంది. అప్పటి నుంచి ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ఆమెను ‘‘ప్రియమైన బిడ్డ’’ , ‘‘గొప్ప మార్గదర్శక వ్యక్తి’’గా సంబోధించడం ప్రారంభించింది. రాబోయే వారాల్లో జరగనున్న ఒక చారిత్రాత్మక కాంగ్రెస్‌లో ఆమె ఉత్తర కొరియా అధికార పార్టీలో రెండవ అత్యంత శక్తివంతమైన పదవి అయిన కేంద్ర కమిటీ మొదటి కార్యదర్శిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.