Khawaja Asif: ఖురాన్‌తో బెదిరింపులు.. చంపేస్తామంటూ పాక్ రక్షణమంత్రి వార్నింగ్..
- పీఓకే నిరసనకారులకు పాక్ రక్షణ మంత్రి బెదిరింపులు..
- ఖురాన్‌ను ప్రస్తావిస్తూ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khawaja Asif: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరుగుతోంది. ఈ నిరసనల్ని అణిచివేసేందుకు పాక్ ఆర్మీ ప్రయత్నిస్తోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపైకి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 30 మందికి పైగా మరణించారు. అయితే, అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య వందకు పైగా ఉంటుందని భావిస్తు్న్నారు. పీఓకేపై పాక్ ప్రభుత్వం నిర్బంధం, హక్కుల అణిచివేతకు నిరసనగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. పాకిస్తార్ రాజ్యాంగాన్ని, ఖురాన్లో అత్యంత కఠిన శిక్షల్ని సూచించే శ్లోకాలను ప్రస్తావిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే, దీనిపై హక్కుల సంస్థలు, మత పెద్దల నుంచి విమర్శలు ఎదుర్కొంటుున్నారు. ‘‘దేశం పట్ల విధేయతతోనే చర్చలు మొదలవుతాయి’’ అంటూ ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఆజాద్ కాశ్మీర్లో కొంత మంది తప్పుదాడి పట్టిన వ్యక్తులు దేశం పట్ల విధేయత చూపే రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 చదవాలని సూచించాడు.
Also Read
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
- Trump: ట్రంప్‌తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- Jammu Kashmir: పాక్‌కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్‌పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
ఇదే కాకుండా ఖురాన్‌లోని సురా అల్ మాయిదాలోని 33 వచనాన్ని ఉటంకిస్తూ, ‘‘అల్లా, ప్రవక్తపై యుద్ధం చేసి, అవినీతి వ్యాప్తి చేయడానికి ప్రయత్నించే వారికి విధించే శిక్ష ఏమిటంటే వారిని చంపడం లేదా శిలువ వేయడం, వారి చేతులు కాళ్లను నరికివేయడం లేదా ఈ దేశం నుంచి బహిష్కరించడం, ఇది ఈ లోకంలో వారికి అవమానం, పరలోకంలో భయంకరమైన శిక్ష అనుభవిస్తారు’’ అంటూ పీఓకే నిరసనకారుల్ని బెదిరించే ప్రయత్నం చేశారు.
ఈ వ్యాఖ్యలపై పాక్‌లోని మత పెద్దలు ఖవాజా ఆసిఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక రాజకీయ ఉద్యమానికి ఇలాంటి వాఖ్యాలను ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ మండిపడ్డారు. రాజకీయ వ్యతిరేకత, మతపరమైన నేరాల మధ్య ఉన్న తేడాను ఆసిఫ్ వ్యాఖ్యలు మసకబారుస్తున్నాయని, అసమ్మతివాదులను రాజ్యం, మతం రెండింటికి శత్రువులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి భోగభాగ్యాలు, పండగే ఇవాళ!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Realme 17 Pro+: రియల్మీ 17 ప్రో+.. 200MP కెమెరా, 1.5K OLED డిస్ప్లేతో అదుర్స్! లీకైన స్పెసిఫికేషన్స్ ఇవే
-
DoT New SIM Rules 2026: కొత్త SIM Card తీసుకోవాలనుకుంటున్నారా? DoT కొత్త రూల్స్ ఇవే.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!