అరిజోనాలోని డగ్లస్‌కు చెందిన యూఎస్- మెక్సికో సరిహద్దు ప్రాంతాన్ని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ సందర్శించారు. ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. దేశంలోకి అక్రమ వలసలను నివారించేందుకు అమెరికా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు.