Putin: పుతిన్ సమక్షంలోనే స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన జర్నలిస్ట్.. వీడియో వైరల్
- పుతిన్ ప్రెస్మీట్లో ఆసక్తికర పరిణామం
- స్నేహితురాలికి పెళ్లి ప్రపోజ్ చేసిన జర్నలిస్ట్
- చప్పట్లతో ఉత్తేజపరిచిన రష్యా అధ్యక్షుడు పుతిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెలబ్రిటీలు వెరైటీగా స్నేహితులకు ప్రపోజ్ చేయడం చూస్తుంటాం. క్రీడాకారులైతే స్టేడియంలో.. సినీ నటులైతే వేదికలపై తమ మనసులోని అభిప్రాయాన్ని చెబుతుంటారు. ఇలాంటి వీడియోలు ఎన్నో వచ్చాయి. తాజాగా రష్యాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక జర్నలిస్ట్.. పుతిన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉండగా స్నేహితురాలికి ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Mallika Sherawat: వైట్‌హౌస్‌లో ట్రంప్ విందుకు హాజరైన మల్లికా షెరావత్.. ఫొటోలు వైరల్
Also Read
- Giorgia Meloni: 3% ఓట్ల పార్టీ నుంచి ప్రధాని వరకు.. జార్జియా మెలోని సరికొత్త రికార్డుకు చేరువ
- Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్‌ల ముప్పు
- 150 Words on One Sticky Note: ఒకే స్టిక్కీ నోట్‌పై 150 పదాలు.. భారత సంతతి క్లౌడ్ ఇంజనీర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు!
- Electric Shock Gloves: అమెరికా దుర్మార్గం..వలసదారులపై కరెంట్ 'షాక్' అస్త్రం!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మారథాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడాది చివరిలో పుతిన్ ఎప్పుడూ విలేకర్ల సమావేశం పెడుతుంటారు. మీడియా సమావేశం లైవ్ జరుగుతుండగా ఓ యువ జర్నలిస్ట్ కిరిల్ బజనోవ్( 23) లేచి తన స్నేహితురాలికి ప్రపోజ్ చేశాడు. ఎర్రటి బో టై ధరించి.. ‘‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.’’ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకున్నాడు. దీంతో హాల్లో జరుగుతున్న విలేకర్ల సమావేశం కాస్త శృంగారభరితంగా మారిపోయింది.
ఇది కూడా చదవండి: Epstein Files: ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల.. కొత్త ఫొటోల్లో బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్
ఈ అరుదైన దృశ్యం పుతిన్ కంటపడింది. ఈ సందర్భంగా బజానోవ్.. ప్రియురాలి పెళ్లి ప్రతిపాదన చేశాడు. ‘నా స్నేహితురాలు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తోందని నాకు తెలుసు. ఒలెచ్కా నన్ను పెళ్లి చేసుకో.’’ అంటూ ప్రపోజ్ చేశాడు. వెంటనే విలేకర్ల నుంచి నవ్వులు, హర్షధ్వానాలు, చప్పట్లు మార్మోగాయి.
ఈ సందర్భంగా పుతిన్ కూడా చప్పట్లు కొట్టడంతో మరోసారి చప్పట్లతో హాలు దద్దరిల్లింది. ప్రతిస్పందనతో ఉత్సాహంగా ఉన్న బజనోవ్.. రష్యా అధ్యక్షుడిని నేరుగా ఉద్దేశించి.. ‘‘మిస్టర్ ప్రెసిడెంట్.. మా వివాహ వేడుకలో మిమ్మల్ని చూడటానికి మేము చాలా సంతోషిస్తాము.’’ అని అన్నాడు. పుతిన్ మాత్రం ఆహ్వానాన్ని తిరస్కరించారు కానీ ఒక తేలికైన వ్యాఖ్యతో అనుగుణంగా వ్యవహరించారు.
దాదాపు గంట పాటు మీడియా సమావేశానికి అంతరాయం కలిగింది. అనంతరం మీడియా సమావేశం యథావిథిగా కొనసాగింది. మొత్తానికి బజనోవ్ స్నేహితురాలు పెళ్లి ప్రతిపాదనను అంగీకరించినట్లుగా కథనాలు పేర్కొన్నాయి.
'Olga, will you marry me?' — local TV journalist proposes during the live Putin Q&A
‘Mr President, we would be so glad to see you at our wedding’
‘You can wait forever, so best not to postpone’ — Putin pic.twitter.com/0H2bwZe7RH
— RT (@RT_com) December 19, 2025
తాజావార్తలు
-
Gautam Gambhir: లైక్స్, వ్యూస్ కాదు.. ట్రోఫీలే ముఖ్యం.. విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్
-
Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
-
Mythri Movie Makers: మైత్రీ రిస్క్‌కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
-
Kollywood: సినిమా ఇండస్ట్రీకి సెప్టెంబర్ షాక్.. కొత్త రిలీజ్‌లకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
-
Spirit Controversy: వంగా బ్రదర్స్ ఆరోపణలపై దీపికా పదుకొణె పరోక్ష కౌంటర్.. ఆ ఒక్క లైక్‌తో సంచలనం!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!