Chinese netizens react to the latest India-China face-off: అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. గల్వాన్ ఘర్షణలు జరిగిన దాదాపు రెండున్నరేళ్ల తరువాత మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే ఈ ఘర్షణలపై చైనా నెటిజెన్లు స్పందిస్తున్నారు. అయితే ఎక్కువగా చైనా నెటిజన్లు సరిహద్దు సమస్యల కన్నా.. అంతర్గత సమస్యలపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం విశేషం. చైనా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ‘విబో’లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ముఖ్యంగా చైనీస్ మీడియా ఈ విషయంపై ఎలాంటి వార్తలు ప్రసారం చేయకపోవడాన్ని యూజర్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధం, చైనా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకపోవడం, కోవిడ్ ఆంక్షలు, ఆర్థిక మందగమనం చైనా కమ్యూనిస్ట్ పార్టీపై ప్రజల్లో కోపం, నిరాశ పెంచుతోంది. యుద్ధం నేపథ్యంలో చైనీస్ నెటిజెన్లు చర్చించుకుంటున్నారు.
సరిహద్దు ఘర్షణలపై నిత్యం విదేశీ మీడియాపై ఎందుకు ఆధార పడాల్సి వస్తుందని అక్కడి నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చైనా ప్రభుత్వం ఇలాంటి వ్యూహాలను అవలంభిస్తుందని చైనీయులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలపై అక్కడి దేశీయ మీడియా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకపోవడంపై కూడా చైనీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోొ గాల్వాన్ లోయ ఘర్షణ సమయంలో కూడా చైనా ప్రభుత్వం మరణాల వివరాలను చాలా నెలలు దాచి పెట్టిందని అక్కడి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Read Also: Amit Shah: చైనాపై నెహ్రూకు ప్రేమ.. అందుకే భారత్‌కు శాశ్వత సభ్యత్వం దక్కలేదు.
భారతదేశం, చైనాతో యుద్ధాన్ని కోరుకుంటున్న దేశం కానది చాలా మంది చైనీస్ నెటిజన్లు భావిస్తున్నారు. భారత్ ఇతర దేశాలతో పోలిస్తే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని.. దీనిపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని వారు భావిస్తున్నారు. చైనా బలహీనతలను భారత్ గుర్తించడం ప్రారంభించిందని.. మరో యుద్ధం తప్పదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు చైనా సైన్యంపై అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కొంత మంది మాత్రం కాబూల్ లో చైనీయులపై దాడిని, టిబెట్ అటానామస్ రీజియన్ పరిణామాలను లింక్ చేస్తూ.. భారత్ కుట్ర చేస్తోందని వాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఇంకొంతమంది భారత పవర్ ప్లాంట్లపై చైనా హ్యకర్ల దాడిని కొనసాగించాలని సూచించారు.
చైనాపై భారత్ యుద్ధానికి సిద్ధం అవుతోందని.. చైనీయులను లక్ష్యంగా చేసుకుని భారత్ కాబూల్ దాడులు చేసిందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ గందరగోళానికి అమెరికా కారణం అని మరికొంతమంది ఆరోపించారు. సరిహద్దుల్లో భారత్ సైనిక మోహరింపును గుర్తించామని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు.