Jaishankar-Rubio: హార్ముజ్‌లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్‌కు రూబియో సూచన
- హార్ముజ్‌లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే
- జైశంకర్‌కు రూబియో సూచన
- నిశితంగా పరిశీలిస్తున్న ప్రపంచ దేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల హార్ముజ్ జలసంధిలో భారత్ నౌకలపై అమెరికా దాడులు చేసింది. దీంతో నౌకలు ధ్వంసంతో పాటు పలువురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా దౌత్యవేత్తను పిలిచి భారత్ నిరసన వ్యక్తం చేసింది. అయితే ఇదే వ్యవహారంపై ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. భారత్ నౌకలపై ఇరాన్ దాడులు చేసిందని రాసుకొచ్చారు. ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే తాజాగా ఇదే వ్యవహారంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక సందేశం ఇచ్చారు. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ప్రయాణించే అన్ని వాణిజ్య నౌకలు అమెరికా జారీ చేసే భద్రతా ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు స్పష్టం చేసినట్లు సమాచారం.
Also Read
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
- US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
ఇదే వ్యవహారంపై జైశంకర్ స్పందించారు. ‘‘ఈ సాయంత్రం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడాను. గల్ఫ్‌లో అమెరికా నౌకాదళం జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించడాన్ని భారతదేశం తీవ్రంగా నిరసిస్తున్నట్లు పునరుద్ఘాటించాను. వాణిజ్య నౌకలపై ఇటువంటి ప్రాణాంతక చర్యలు సమర్థనీయం కావు.’’ అని జైశంకర్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, హార్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న భద్రతా ఆందోళనల నేపథ్యంలో రూబియో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గంగా ఉన్న హార్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతను నిర్ధారించేందుకు అమెరికా చేపడుతున్న చర్యలకు అన్ని వాణిజ్య నౌకలు సహకరించాలని సూచించారు.
ఇటీవల హార్ముజ్ జలసంధి సమీపంలో పలు వాణిజ్య నౌకలపై దాడులు, డ్రోన్ ముప్పులు వెలుగులోకి రావడంతో అంతర్జాతీయ సమాజం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో భారత నౌకలు, భారతీయ సిబ్బంది భద్రతపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. భారత్-అమెరికా మధ్య జరిగిన ఈ చర్చల్లో ప్రాంతీయ భద్రత, సముద్ర మార్గాల రక్షణ, ఇంధన సరఫరా భద్రత వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లు దౌత్య వర్గాలు పేర్కొన్నాయి. హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం రవాణా అవుతుండటంతో అక్కడి పరిస్థితులపై ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.
Spoke to US Secretary of State Marco Rubio this evening. I reiterated India’s strong protest at the attacks by the US Navy in the Gulf that killed three Indian mariners. Such lethal actions against commercial shipping are not justified.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 12, 2026
Tommy Pigott, Principal Deputy Spokesperson for the US Department of State, says, "US Secretary of State Marco Rubio spoke yesterday with Indian External Affairs Minister Subrahmanyam Jaishankar. The two officials discussed recent events in the Strait of Hormuz. The Secretary… pic.twitter.com/OvsjGBLh0a
— ANI (@ANI) June 13, 2026
- Tags
- india
- Jaishankar
- Marco Rubio
- Rubio
- us
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!