టారిఫ్ ఉద్రిక్తతల వేళ భారత్-అమెరికా మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. సుంకాలు కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ సమావేశం శుభపరిణామంగా భావించొచ్చు.
ఇది కూడా చదవండి: Siddaramaiah: దసరా వేడుకల్లో సిద్ధరామయ్య రుసరుసలు.. ప్రేక్షకులపై ఆగ్రహం
న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 80వ సెషన్ జరుగుతోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా వెళ్లారు. పర్యటనలో భాగంగా జైశంకర్‌ను మార్కో రూబియో కలిశారు. ఈ సందర్భంగా వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ఔషధాలు, కీలకమైన ఖనిజాలు వంటి కీలక రంగాలు, ముఖ్యంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: ఈరోజు మళ్లీ జుబీన్ గార్గ్‌కు పోస్టుమార్టం.. అనంతరం అంత్యక్రియలు
ఇక జైశంకర్‌ను కలవడంపై మార్కో రూబియో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రెండు దేశాల మధ్య శ్రేయస్సును పెంపొందించే లక్ష్యంతో ద్వైపాక్షిక భాగస్వామ్యంతో పాటు వివిధ అంశాలపై చర్చలు జరిగాయని పేర్కొన్నారు. రెండు దేశాలు కలిసి పని చేయడానికి అంగీకరించినట్లు ప్రకటనలో తెలిపింది.
అలాగే జైశంకర్ కూడా ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. సోమవారం ఉదయం న్యూయార్క్‌లో విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను కలవడం ఆనందంగా ఉంది. మా సంభాషణలో ప్రస్తుత ఆందోళన కలిగించే అనేక ద్వైపాక్షిక, అంతర్జాతీయ సమస్యలు ఉన్నాయి.’’ అని జైశంకర్ పేర్కొన్నారు.
భారత్‌పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం మరో బాంబ్ పేల్చారు. రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు భారత్‌పై మరో 25 శాతం సుంకం విధించినట్లు ప్రకటించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే రైతుల కోసం ఎంత భారమైనా ప్రకటిస్తామని ప్రధాని మోడీ స్పష్టంచేశారు.
Met with Indian External Affairs Minister @DrSJaishankar at UNGA. We discussed key areas of our bilateral relationship, including trade, energy, pharmaceuticals, and critical minerals and more to generate prosperity for India and the United States. pic.twitter.com/5dZJAd85Za
— Secretary Marco Rubio (@SecRubio) September 22, 2025