Israel: న్యాయ సంస్కరణలకు ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: న్యాయ సంస్కరణలకు ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇజ్రాయెల్‌లో ఎన్ని ఆందోళనలు ఎదురైనా నెతన్యాహు ప్రభుత్వం తెచ్చిన న్యాయ సంస్కరణలకు పార్లమెంట్ ప్రాథమికంగా ఆమోదముద్ర వేసింది. దీంతో తొలి దశలో నెతన్యాహు వర్గం విజయం సాధించినట్టయింది. దేశ సుప్రీంకోర్టు అధికారాలను నియంత్రిస్తూ ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రాథమికంగా పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాని బెంజిమన్ నెతన్యాహు చేపట్టిన న్యాయ సంస్కరణల్లో భాగంగా ఈ బిల్లు పార్లమెంటు వద్దకు వచ్చింది. ఈ బిల్లు ప్రతిపక్షాల్లో, దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు కారణమైన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా అమెరికా వంటి దేశాలు కూడా దీనిని తప్పుపట్టాయి.
Read also: Pawan Kalyan: వాలంటీర్ వ్యవస్థ లేనపుడు దేశం ఆగిపోలేదు.. జనసేనాని కామెంట్స్
Also Read
- Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
- Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
- Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
124 మంది సభ్యులున్న పార్లమెంటులో 64 మంది న్యాయ సంస్కరణలకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్, మంత్రులు, ఇతర ఎన్నికైన సభ్యుల నిర్ణయాలు అహేతుకంగా ఉన్నాయనే పేరిట ఇక నుంచి సుప్రీం కోర్టు కొట్టేయడానికి అవకాశం లేదు. ఇక ఈ బిల్లు చర్చకోసం కమిటీ వద్దకు రానుంది. అక్కడ చర్చల అనంతరం మార్పులు చేర్పులు చోటు చేసుకొని.. తిరిగి తుది ఓటింగ్‌కో పార్లమెంటుకు వెళుతుంది. దీనిపై ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యానికి ముగింపు కాదని.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థను సంస్కరిస్తామనే హామీతో తమ కూటిమి అధికారంలోకి వచ్చిందని నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. వామపక్ష భావజాలం గల జడ్జీలతో న్యాయవ్యవస్థ నిండిపోయిందన్నది వారి ఆరోపణ. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలను తిరస్కరించే హక్కు.. ప్రజలు ఎన్నుకోని న్యాయమూర్తులకు ఉండదని నెతన్యాహు వర్గం వాదిస్తోంది. సుప్రీంకోర్టుతోపాటు దేశంలోని ఇతర కోర్టులకు జడ్జీలను నియమించే అధికారం ప్రభుత్వానికే ఉండాలంటున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాధినేతలూ ఇజ్రాయెల్ న్యాయవ్యవస్థ ప్రక్షాళనపై ఆందోళన వ్యక్తం చేశారు. మీరు వెళుతున్న దారి సరైనది కాదంటూ గతంలో నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
- Tags
- Approves
- Israel
- Legal
- Parliament
- reforms
తాజావార్తలు
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..