Site icon NTV Telugu

Israel: పాలస్తీనా దేశాన్ని అంగీకరించబోం.. యూఎన్ తీర్మానానికి ముందు ఇజ్రాయెల్ ప్రకటన

Netanyahu

Netanyahu

పాలస్తీనా దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. గాజా శాంతి ఒప్పందానికి సంబంధించిన తీర్మానంపై సోమవారం ఐక్యరాజ్యసమితిలో అమెరికా ఓటు వేయనుంది. అమెరికాతో పాటు ఈజిప్ట్, ముస్లిం దేశాలు మద్దతుగా ఓటు వేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ పరిస్థితుల్లోనూ పాలస్తీనా దేశాన్ని అంగీకరించబోమని ఇజ్రాయెల్ పేర్కొంది.

పాలస్తీనా దేశాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు సహా మంత్రులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇజ్రాయెల్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న తరుణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: Congo Video: కాంగోలో కూలిన మైనింగ్ గని వంతెన.. 32 మంది మృతి

గాజా-ఇజ్రాయెల్ మధ్య గత రెండేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. ఇటీవల ట్రంప్ మధ్యవర్తిత్వంలో శాంతి ఒప్పందం జరిగింది. ఈజిప్ట్ వేదికగా శాంతి ఒప్పందం జరిగింది. తాజాగా ఈ ఒప్పందాన్ని అనుసరించి సోమవారం ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేయనున్నారు. ఇందుకోసం అమెరికాతో పాటు ఈజిప్ట్, ముస్లిం దేశాలు ఓటింగ్ వేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నెతన్యాహు ఆధ్వర్యంలో మంత్రివర్గం సమావేశం అయింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ భూభాగంలోనైనా పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఈ మేరకు మంత్రివర్గం కూడా ఏక తీర్మానం చేసింది. ఇజ్రాయెల్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న తరుణంలో మిత్రదేశమైన అమెరికా ఏం చేస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి: Thalaivar173 : మామ సినిమాకు అల్లుడు డైరక్షన్.. కూతురు ఒప్పుకుంటుందా.?

ఐక్యరాజ్యసమితిలో చేయబోయే తీర్మానం ప్రకారం.. గాజాలో ఇజ్రాయెల్, ఈజిప్ట్, కొత్తగా శిక్షణ పొందిన పాలస్తీనా పోలీస్ యూనిట్లు భద్రతాగా ఉండనున్నాయి. అంతేకుండా క్రమక్రమంగా 2027 నాటికి పాలస్తీనా రాజ్యంగా కూడా విస్తరించనుంది. ఈ తీర్మానాన్ని వేగంగా ఆమోదించాలంటూ అమెరికా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ, ఖతార్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, పాకిస్థాన్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు శుక్రవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరాయి. త్వరగా తీర్మానం ఆమోదించాలని విజ్ఞప్తి చేశాయి.

Exit mobile version