పాలస్తీనా దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. గాజా శాంతి ఒప్పందానికి సంబంధించిన తీర్మానంపై సోమవారం ఐక్యరాజ్యసమితిలో అమెరికా ఓటు వేయనుంది. అమెరికాతో పాటు ఈజిప్ట్, ముస్లిం దేశాలు మద్దతుగా ఓటు వేయనున్నాయి.
ఇకపై పాలస్తీనా రాజ్యం ఉండబోదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. పాలస్తీనా రాజ్య స్థాపనకు ఆయా దేశాలు మద్దతు పలుకుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేస్తామంటూ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి ఈ ప్రకటన రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఇకపై పాలస్తీనా దేశంగా ఉండబోదని ప్రతిజ్ఞ చేశారు. ఖతార్‌లో హమాస్ నాయకుల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి తర్వాత అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.