Iran War: ట్రంప్‌ను చంపుతారని భయపెట్టిన ఇజ్రాయిల్.. అందుకే మళ్లీ అమెరికా ఇరాన్‌పై దాడి చేసిందా?
- ట్రంప్ హత్య కుట్రపై ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్
- దీంతోనే ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడి
- సమాచారాన్ని ధృవీకరించని అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్‌పై అమెరికా మరోసారి భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ సైనిక స్థావరాలపై విరుచుకుపడుతోంది. ముఖ్యమైన పోర్టులు, రైల్వే వంతెనల్ని కూడా టార్గెట్ చేస్తోంది. అయితే, ఈ దాడుల వెనక ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఉందని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ మరోసారి కుట్ర పన్నుతోందని అమెరికాకు ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు అమెరికన్ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతోనే ట్రంప్ ఆమోదంతో అమెరికా ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎన్ఎన్ కథనం ప్రకారం.. ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతోందని పెంటగాన్‌కు ఇజ్రాయిల్ సమాచారం ఇచ్చింది. అయితే, ఈ సమాచారాన్ని అమెరికా స్వతంత్రంగా ధ్రువీకరించలేదని, ఇజ్రాయిల్ హెచ్చరికలకు ముందు ఎలాంటి నిర్దిష్ట హత్య కుట్రపై తమ వద్ద సమాచారం లేదని నివేదికలు చెబుతున్నాయి. అయితే, కొందరు అమెరికా అధికారులు మాత్రం ఇరాన్‌పై సైనిక చర్యలను మరింత తీవ్రం చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయిల్ ఈ సమాచారాన్ని ఉపయోగించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
- Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..
ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో, అప్పటి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్లో ఉన్నత జనరల్‌గా పనిచేసిన ఖాస్సెమ్ సులేమానీ హత్యలో అమెరికా పాత్ర ఉందని, ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ చాలా సందర్భాల్లో బెదిరించింది. ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, ఇతర కుటుంబ సభ్యుల అంత్యక్రియల ఉరేగింపులో ట్రంప్‌ను చంపేస్తామని నినాదాలు చేశారు.
ఇటీవల, ట్రంప్ కూడా తన ప్రాణాలకు ఇరాన్ నుంచి ప్రమాదం ఉందని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. మరోవైపు, ఇరాన్ యుద్ధం, శాంతి చర్చల తర్వాత ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూల మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడిప్పుడే వీరిద్దరి మధ్య సంబంధాలు బలపడినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కూడా మాట్లాడుకున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!