గాజాను స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గాజాను స్వాధీనం చేసుకోమని.. హమాస్ అంతమే లక్ష్యమని నెతన్యాహు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: AI replacing Keyboard and Mouse: ఐదేళ్ల తర్వాత మౌస్-కీబోర్డ్ అవసరమే ఉండదట.. మైక్రోసాఫ్ట్ సంచలనం
తాజాగా ఆదివారం కీలక ప్రకటన చేశారు. గాజాలో సైన్యం ప్రారంభించబోయే కొత్త ఆపరేషన్ చాలా తక్కువ సమయంలో ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ‘‘కచ్చితమైన టైమ్‌టేబుల్ గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు. కానీ మేము యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాము. కాబట్టి చాలా తక్కువ టైమ్‌టేబుల్ గురించి మాట్లాడుతున్నాము.’’ అని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. తమ ప్రభుత్వానికి గాజాను ఆక్రమించే ప్రణాళికలు లేవని.. సురక్షితమైన కారిడార్లను సృష్టిస్తామని ప్రతిజ్ఞ చేశారు. హమాస్ లేదా పాలస్తీనా అథారిటీతో సంబంధం లేని పౌర పరిపాలనను స్థాపించడమే ప్రధాన కర్తవ్యం అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: WAR 2 Pre Release Event : ఎన్టీఆర్ నాకు తమ్ముడు.. సింగిల్ టేక్ యాక్టర్.. హృతిక్ ప్రశంసలు
2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇప్పటివరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అంతర్జాతీయ మధ్యవర్తుల సాయంతో కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. మిగతా వారి సమక్షంలోనే ఉన్నారు. వారి విడుదల కోసం ఇజ్రాయెల్ ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.