NTV Telugu Site icon

Israel-Gaza: ఇజ్రాయెల్ దాడుల్లో 400 మంది మృతి.. జస్ట్ ఇది శాంపిల్ మాత్రమేనన్న నెతన్యాహు

Benjaminnetanyahu

Benjaminnetanyahu

గాజా-ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధం రాజుకుంది. కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకరించకపోవడంతో ఇజ్రాయెల్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించింది. ఏడాదికిపైగా జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటికే గాజా సర్వనాశనం అయింది. తాజాగా జరిపిన దాడుల్లో అయితే భారీ స్థాయిలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తులు ధ్వంసం అయ్యాయి.

సోమవారం అర్ధరాత్రి నుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడింది. ఈ ఘటనలో హమాస్‌కు చెందిన కీలక నేతలంతా నేలకొరిగినట్లు సమాచారం అందుతోంది. దాదాపు ఇప్పటి వరకు 413 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మృతదేహాలు, క్షతగాత్రులతో ఆస్పత్రులు రక్తమోడాయి.

ఇది కూడా చదవండి: Ghaziabad: ఈ-రిక్షా బ్యాటరీ పేలి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి గాయాలు

ఇదిలా ఉంటే తాజాగా హమాస్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని.. ముందు ముందు మరిన్ని పరిణామాలు ఉంటాయని హెచ్చరిచారు. కాల్పుల విరమణ తర్వాత అతిపెద్ద దాడిగా చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే తాజా దాడుల్లో గాజా ప్రభుత్వ అధిపతి ఎస్సామ్ అల్-డాలిస్ ఉన్నట్లుగా హమాస్ తెలిపింది. అలాగే 400 మందికి పైగా కీలక నేతలు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఇక శిథిలాల కింద అనేక మంది ఉన్నట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి: Anakapalle Murder Case: శరీర భాగాలు లభ్యం కేసు.. హత్యకు గురైంది మహిళ కాదు..!

2023, అక్టోబర్ 7న హమాస్ అమాంతంగా ఇజ్రాయెల్‌పై దాడి చేసి దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. ఆనాటి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా భీకరదాడులకు పాల్పడింది. వందలాది మంది పాలస్తీనియులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవల అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చలతో కాల్పుల విరమణ లభించింది. ఆ సమయంలో ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. అయితే ఈ ఒప్పందం ఇటీవల ముగిసింది. అయితే ఈ ఒప్పందాన్ని కొనసాగించాలని ఇజ్రాయెల్ కోరింది. కానీ అందుకు హమాస్ అంగీకరించలేదు. పైగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని… బందీలను ఒకేసారి విడుదల చేయకపోతే.. హమాస్‌ నరకం చూస్తోందని హెచ్చరించారు. అయినా కూడా హమాస్ లొంగలేదు. ఒప్పందం ప్రకారమే బందీలను విడుదల చేస్తామని తేల్చిచెప్పింది. దీంతో తాజాగా మరోసారి ఇజ్రాయెల్ దాడులకు దిగింది. భవిష్యత్‌లో మరిన్ని దాడులు జరగొచ్చని తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చి చెప్పారు. అలాగే సిరియా, లెబనాన్‌పై కూడా దాడులకు పాల్పడింది.

ఇది కూడా చదవండి: Ranya Rao: రన్యారావు అరెస్ట్ కాగానే నటుడు తరుణ్ రాజ్ ఏం చేశాడంటే..!