Israel-Lebanon War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 254కు చేరిన మృతులు
- లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు
- 254కు చేరిన మృతులు, 1,000 మందికి గాయాలు
- గురువారాన్ని జాతీయ సంతాప దినంగా ప్రకటించిన లెబనాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెబనాన్‌పై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బుధవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మృతుల సంఖ్య 254కు చేరింది. వందలాది మంది గాయపడ్డారు. ప్రస్తుతం లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ఇరాన్-అమెరికా మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీనికి ఇజ్రాయెల్ కూడా మద్దతు తెలిపింది. దీంతో 40 రోజుల యుద్ధానికి తెరపడిందని అంతా భావించారు. రెండు వారాల పాటు పశ్చిమాసియా ప్రశాంతంగా ఉంటుందని భావించారు. కానీ బుధవారం అందుకు భిన్నంగా వాతావరణం నెలకొంది. ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఒక్కసారిగా వైమానిక దాడులతో లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. భారీ భవంతలు కూలిపోయాయి. ఇప్పటి వరకు 254 మంది చనిపోగా.. వందలాది మంది గాయపడ్డారు.
అసలేం జరిగిందంటే..
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఆయనతో పాటు కీలక నేతలంతా మృత్యువాత పడ్డారు. అయితే ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై లెబనాన్ వైమానిక దాడులు చేసింది. దీంతో ప్రతీకారంగా హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా ఇరాన్‌తో జరిగిన ఒప్పందం లెబనాన్‌కు ఏ మాత్రం వర్తించదని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ భారీ స్థాయిలో దాడులు చేసింది.

అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని ఇరాన్ జీర్ణించుకోలేపోయింది. ఒప్పందం ఉల్లంఘించారంటూ ధ్వజమెత్తింది. అయితే ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా తేల్చి చెప్పారు. ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని టెహ్రాన్ పొరబడిందని… వాస్తవానికి దానికి అమెరికా అంగీకరించలేదని తేల్చి చెప్పారు.
ఇదిలా ఉంటే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ ఖండించారు. ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్‌లో ఐదో వంతు మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
ఇక ఇజ్రాయెల్ జరిపిన దాడుల అనంతరం గురువారాన్ని జాతీయ సంతాప దినంగా లెబనాన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 254 మందికి పైగా మరణించగా.. 1,000 మందికి పైగా గాయపడినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ హత్యా యంత్రాగాన్ని అడ్డుకునేందుకు దౌత్య ప్రయత్నాలు చేస్తున్నట్లు లెబనాన్ ప్రధానమంత్రి నవాఫ్ సలాం కార్యాలయం తెలిపింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!