హిజ్బుల్లా అంతమే తమ లక్ష్యమంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఐకరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రతిజ్ఞ చేసిన కొన్ని నిమిషాలకే ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌పై భీకరదాడులకు దిగింది. హిజ్బుల్లా సంస్థకు చెందిన స్థావరాలు టార్గెట్‌గా దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తల వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ.. తమ లక్ష్యాలు పూర్తయ్యే వరకు హమాస్, హిజ్బుల్లా మీద పోరాటం ఆగదని అంతర్జాతీయ వేదికగా నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ సగం బలగాలను అంతం చేశామని.. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామని పేర్కొన్నారు.