Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
- 100 రోజులు పూర్తి చేసుకున్న పశ్చిమాసియా యుద్ధం
- ఇంకా కుదరని శాంతి ఒప్పందం
- హార్ముజ్ తెరుచుకోకపోతే మరింత సంక్షోభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై 100 రోజులు పూర్తి చేసుకుంది. 100 రోజులు గడుస్తున్నా పరిస్థితులు చక్కబడలేదు. ఇప్పటికే అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. అనంతరం ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడంతో పాటు హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు మాత్రం తగ్గలేదు. వాస్తవానికి మొదట కొద్ది రోజుల్లోనే యుద్ధం ముగిసిపోతుందని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు.
హార్ముజ్ జలసంధి మూసేసి దాదాపు 100 రోజులైంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆయా దేశాలు అల్లాడిపోతున్నాయి. హార్ముజ్ దిగ్బంధం ఇంకా కొనసాగితే మాత్రం ప్రపంచ దేశాలు మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అమెరికా-ఇరాన్ మధ్య ఇంకా శాంతి ఒప్పందం జరగలేదు. యురేనియం దగ్గర పంచాయితీ తెగడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర అణు బాంబ్ ఉండటానికి వీల్లేదని అమెరికా అంటోంది. అందుకు ఇరాన్ ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో శాంతి ఒప్పందం జరగడం లేదు.
Also Read
- Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
- Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
ఇంకోవైపు పాకిస్థాన్ మధ్యవర్తిగా శాంతి ఒప్పందానికి ప్రయత్నిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పటికే ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఒకవేళ యుద్ధం గనుక ఇలానే కొనసాగితే మాత్రం ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ కష్టాలు మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.
- Tags
- Gas
- Hormuz Strait
- Iran
- Israel
- Oil Crisis
తాజావార్తలు
-
Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
-
West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
-
Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
-
Thaman : ‘ఎల్లమ్మ’ కథపై తమన్ షాకింగ్ కామెంట్స్..
-
Infosys: ఉద్యోగాల ఊస్ట్ సమయంలోనూ ఈ కంపెనీ ఏకంగా కోటి రూపాయల జీతాలు ఎలా ఇస్తోంది?
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!